రాజమౌళి ‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ ఇమేజ్ లోకి వెళ్ళిపోయిన ప్రభాస్ అదే రాజమౌళి సెంటిమెంట్ తో ఇప్పుడు నష్టపోవటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’ స్థాయికి మించి ‘సాహో’ హిట్ అవుతుంది అని భావిస్తే ప్రభాస్ కెరియర్ లోనే ‘సాహో’ భయకరమైన ఫ్లాప్ గా మారుతుందా అంటూ సందేహాలు కలుగుతున్నాయి. 

రాజమౌళి తన సినిమాలలో నటించే హీరోలకు ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తాడో ఆ హిట్ తరువాత ఆ హీరో వేరే దర్శకుడుతో చేసే సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారుతూ ఉంటాయి. ఇది ఎదో యాధృశ్చికంగా జరిగింది కాదు. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలు ఎన్టీఆర్ రవితేజా  నితిన్ రామ్ చరణ్ సునీల్ లకు అనుభవ పూర్వకంగా ఈ సెంటిమెంట్ గతంలో ఎదురైంది. 

ఈ హీరోలు అంతా రాజమౌళితో ఒక సూపర్ బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన తరువాత వెనువెంటనే నటించిన సినిమా ఫ్లాప్ గా మారడం ఒక సెంటిమెంట్ గా మారింది. గతంలో ఇలాంటి సెంటిమెంట్ వల్ల ప్రభాస్ కూడ నష్టపోయాడు. ఇప్పుడు మళ్ళీ రెండవసారి ప్రభాస్ ఆ సెంటిమెంట్ కు బలైపోయాడు. దీనితో ‘సాహో’ ను హిట్ చేయాలి అంటూ విపరీతంగా కష్టపడ్డ ప్రభాస్ సంకల్పం కంటే రాజమౌళి సెంటిమెంట్ బలంగా పని చేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ పడుతున్నాయి. 

దీనితో రానున్న రోజులలో తిరిగి ప్రభాస్ ను నిలబెట్టగలిగే శక్తి ఒక్క రాజమౌళికి మాత్రమే ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ పనిలో బిజీగా ఉన్న రాజమౌళి మళ్ళీ ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే కనీసం రెండు సంవత్సరాలు ఎదురు చూడాలి. అప్పటి దాకా ప్రభాస్ తన స్వశక్తితో తనకు హిట్ ఇవ్వగల సమర్ధుడైన దర్శకుడు కోసం అన్వేషణ సాగిస్తూనే ఉండాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: