బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభమై అప్పుడే ఆరువారాలు అయిపోయింది. నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్3 టాప్ టిఆర్పీ రేటింగ్స్ తో బుల్లితెరపై జెట్ స్పీడ్ తో ముందుకు పోతుంది. 15 మంది కాంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ 3 ..ప్రస్తుతం 11 మందితో ముందుకు సాగుతోంది.

ఇప్పటికే ఐదుమంది హౌస్ మేట్స్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసారు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా కూడా వచ్చిన రెండో వారమే ఎలిమినెట్ అయ్యి బయటకి వెళ్ళిపోయింది.ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరగచ్చు..ఎందుకు అంటే అది బిగ్ బాస్ హౌస్. ఇక ఈ వారం బిగ్ బాస్ సీజన్3లో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుంది అని తాజాగా వచ్చిన ప్రోమోని చూస్తే అర్థమౌతుంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్ట్ నాగార్జున కి బదులు శివగామి రమ్యకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. రమ్యకృష్ణ బిగ్ బాస్ ఎంట్రీ అదిరిపోయింది అని చెప్పాలి. బాహుబలి లో శివగామి గా ఎలాగైతే ఎంట్రీ ఇస్తుందో అదే లెవెల్ లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ కి గురిచేసింది. ఇదే నా మాట..నా మాటే శాసనం అంటూ బిగ్ బాస్ ని సైతం వణికించినట్టు తెలుస్తుంది.

ఇక అసలు హోస్ట్ నాగ్ ఎక్కడికి పోయారు.. ఎందుకు షో కి రాలేదు...లేకపోతే బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకున్నారా అని ఆలోచిస్తున్నారా... అసలు విషయం ఏమిటంటే...నాగ్ తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రస్తుతం ఫారెన్ ట్రిప్ లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. దీనితో ఈ వీకెండ్ బిగ్ బాస్ హోస్ట్ గా శివగామి అందరిని బయపెట్టబోతుంది. నెక్స్ట్ వారం మళ్ళీ నాగ్ తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెడతాడు. ఏదేమైనా బిగ్ బాస్ లో శివగామి ని చూస్తుంటే.. ఆ మహిస్మతి సామ్రాజ్యం పట్టపు రాణి లానే కనిపిస్తుంద.. ఈ వారాంతరం ఎపిసోడ్ మిస్ కాకండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: