ఇద్దరు స్టార్ హీరోలు.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అగ్ర దర్శకుడు.. ప్రతిష్ఠాత్మక బ్యానర్.. భారీ బడ్జెట్.. టాలీవుడ్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేని పాజిటివ్ బజ్‌తో మాసివ్ మల్టీస్టారర్‌‌గా దర్శకధీరుడు జక్కన్న రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్. ఒక్కొక్కరికి గాయాల కారణంగా డిలే అవుతున్న ఆర్.ఆర్.ఆర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడీ టీం సౌత్ ఆఫ్రికా లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రికరించేందుకు రెడీ అయింది. మరి ఆ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇప్పుడు మీకోసం. 


బాహుబలి' సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మొట్టమొదటి సినిమా పైగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మొట్టమొదటి మల్టీస్టారర్ సినిమా కాబట్టి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి అండ్ టీం రాత్రింబవళ్లు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం. ఆర్.ఆర్.ఆర్ చిత్ర యూనిట్ సౌత్ ఆఫ్రికా వెళ్లనుంది. 


సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ప్రస్తుతం ప్రొడక్షన్ టీం సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కు సంబంధించిన ఏర్పాట్లలో మునిగి పోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ లొకేషన్స్ ఎంపిక కూడా జరిగిందట. దాదాపు మూడు వారాల పాటు ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ అక్కడ జరుపబోతున్నారు.


డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందించారు. ఇక ఎప్పటినుండి వస్తున్న వార్తల నేపథ్యంలో  ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక దొంగ కనిపించనున్నాడట. అంతేకాక రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య సీన్లు సినిమాలో హైలైట్గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇంతకీ వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇంతకు మునుపు ఎన్టీఆర్ 'యమదొంగ' సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో నే దొంగ పాత్రలో కనిపించాడు. ఇక చెర్రీ కూడా 'తూఫాన్' లో పోలీస్ గా దర్శనమిచ్చాడు.


ఇకపోతే  ఈ ఫిక్షనల్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రను చేస్తున్నారు. కట్ చేస్తే నిజానికి రాజమౌళికి జూలై సెంటిమెంట్ ఉంది. ఆయన తీసిన చిత్రాల్లో సగానికి సగం జూలై నెలలోనే విడుదల చేస్తుంటారు. ఆయన 12 చిత్రాల్లోనూ 6 చిత్రాలు జూలై నెలలోనే విడుదలయ్యాయి. బాహుబలి ది బిగినింగ్ జూలై 10న విడుదల కాగా.. ఈగ జూలై 6, మర్యాద రామన్న జూలై 22, మగధీర జూలై 31, సింహాద్రి జూలై 9న విడుదల చేశారు. తాజాగా ప్రతిష్ఠాత్మక ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కూడా జూలై నెలలో 30 విడుదల చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: