బిగ్ బాస్ అభిమానులు, ప్రేక్షకులు శనివారం, ఆదివారం ఎపిసోడ్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆ రెండు రోజులు కింగ్ నాగార్జున ఇంటి సభ్యులతో కలిసి సందడి చేస్తూ...ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. ఇంటి సభ్యులకు సీరియస్ గా క్లాస్ పీకుతూనే సరదా ఆటలు ఆడిస్తారు. ఎలిమినేషన్ నుంచి ఒకరిని ఇంటికి బయటకు పట్టుకుపోతారు. అందుకే ఆ రెండు రోజుల ఎపిసోడ్ల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తారు.


ఇక అందరూ ఎదురు చూస్తున్నట్లే శనివారం ఎపిసోడ్ వచ్చింది. కింగ్ నాగార్జున కూడా కనిపించారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో కాదు స్పెయిన్ లో  తన పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబంతో కలిసి స్పెయిన్ వెళ్లానని.. అందుకే బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి కాకుండా స్పెయిన్ నుండి వీడియో ద్వారా మాట్లాడుతూ ఎంట్రీ ఇచ్చారు. ఇక తన ప్లేస్‌లో ఈవారం హోస్ట్‌గా కింగ్ ప్లేస్‌లో క్వీన్ రమ్యకృష్ణ వస్తుందని పరిచయం చేశారు. 


దీంతో శివగామి ‘రమ్యకృష్ణ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. నా మాటే శాసనం అంటూ శివగామి గెటప్ లో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజి మీదకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి...శుక్రవారం ఇంటి సభ్యులు ఏం చేశారో మన టి‌వి ద్వారా చూపించారు. పొద్దు పొద్దునే శ్రీముఖి గట్టిగా మాట్లాడుతుండటంతో అలీ కెప్టెన్ వరుణ్ కు గట్టిగా అరుస్తుందని ఫిర్యాదు చేస్తాడు. దీంతో శ్రీముఖి వారి మాటలని లెక్క చేయకుండా ఇంకా గట్టిగా మాట్లాడేసింది.


వీరి ఎపిసోడ్ తర్వాత ఇంటిని క్లీన్ చేసే పనిలో ఉన్న పునర్నవి, రాహుల్ మధ్య గొడవ వచ్చింది. ఏదో పని విషయంలో పునర్నవి రాహుల్ ని తిట్టేసింది. దీంతో రాహుల్ బాబా మాస్టారుకు చెప్పడంతో తెలియక చేశాడు క్షమించు భూపాళం అంటూ బాబా సరదాగా మాట్లాడాడు. అలాగే నాగార్జున పుట్టినరోజు సందర్బంగా రాహుల్ ఓ పాట రాసి పాడటం, దానికి బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేసి ఇంటి సభ్యులతో  డ్యాన్స్ చేయించాడు. అనంతరం నాగార్జునకి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: