భారీ బడ్జెట్తో సినిమాలు తీయడం మంచిదే కానీ ఆ భారీ బడ్జెట్ లో అవసరం లేని బడ్జెట్ ఎక్కువ పెంచి వాటిలో ఎన్నో విలువైన వస్తువులను ధ్వంసం చేయడం అనేది మంచి విషయం కాదు అని అభిప్రాయపడుతున్నారు ప్రజలు. ఒకప్పుడు బాలకృష్ణ సినిమాలలో కూడా ఇటువంటి కాలం ద్వంసం చేయడమో ఇక మరిన్ని వస్తువులను ధ్వంసం చేసే సన్నివేశాలు ఎక్కువగా ఉండడం అది ఎంతో ధ్వని కాలుష్యానికి కూడా సినిమాలు తీయడం అనేది మనకు తెలిసిన విషయమే. వీటిపై ఎన్నో జోకులు వేయడమే కాకుండా వచ్చే తరం వీటిని అంతగా ఇష్టపడకపోవడం గమనించి తగ్గించారు.

కానీ ఈ ట్రెండ్ను మళ్లీ సాహో తిరిగి తీసుకు వచ్చింది అని టాలీవుడ్ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు బడ్జెట్ ను పెంచి ఇంత ఎక్కువ బడ్జెట్లో సినిమా తీశామని చెప్పడం వల్ల అంతే ఎక్కువ బడ్జెట్ ను రాబట్టగల టెక్నిక్ వాడుతున్నారేమో. ఆ బడ్జెట్ ని ఎలా పెంచాలో తెలియక ఇష్టం వచ్చినట్టు వాహనాలను ధ్వంసం చేసే సీను పెట్టినట్టు అందులో ఎటువంటి అర్థం పర్థం లేని సినిమా చూసిన ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమా లో 30 కోట్లు 30 రోజుల్లో ఖర్చు పెట్టగలిగితే ఆస్తి అంతా తనకు దక్కుతుంది అని అంటాడు ఆయన తండ్రి. దాని కోసం డబ్బు ఖర్చు ఎలా పెట్టాలో తెలియక ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతుంటారు. సాహో సినిమాలో కూడా డైరెక్టర్ సుజిత్ అలాగే చేసినట్టు అనిపించింది అన్నారు ఫాన్స్.

ప్రభాస్ సినిమాలు అంటే ఒక క్వాలిటీ స్థాయి ఉంటుంది అని ఫ్యాన్స్ ఎప్పుడూ దానిని గౌరవంగా అందరికీ చెప్పుకుంటూ ఉంటారు అని, అంతేగాని ఇలా అతిగా డబ్బు ఖర్చు పెట్టి అవసరం లేని సీన్ క్రియేట్ చేయడం వల్ల ప్రభాస్ యొక్క స్టాండర్డ్స్ తగ్గిపోతాయని ఫాన్స్ వ్యక్తపరుస్తున్నారు. ఒక్క సీన్ కి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినట్లుగా వార్తలు చెప్పడం అన్నది సినిమా అంజలి అంచనాలను భారీగా పెంచి అది ఫ్లాపయి అవకాశాలు కూడా పెరగవచ్చు అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: