పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ పవన్‌కు ఇంత క్రేజ్ రావడం వెనుక కారణం ఎవరో తెలుసా..? పవన్ కల్యాన్ బ్యాగ్రౌండ్ కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు.

ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. వీరు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, రెండో వారు నాగేంద్ర బాబు. పవన్ కల్యాణ్ తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఎక్కడికి ట్రాన్ఫర్ అయితే అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేంది. అందుకే పవన్ చదువు ఒక దగ్గర సాగలేదు. పది వరకు ఎన్నో స్కూళ్లు మారిన పవన్.. ఇంటర్ మాత్రం నెల్లూరులో చదివాడు.


ఆ తర్వాత విద్యాభ్యాసం ఆపేశాడు. సినిమాలపై ఆసక్తి లేకున్నా... పవన్ కల్యాణ్ ఇంటర్ పూర్తి చేసిన తర్వాత కంప్యూటర్ డిప్లొమా చేశాడు. ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో పుస్తకాలు చదవడం, ఒంటరిగా ఉండడం చేసేవాడు. ఇది గమనించిన వదిన (చిరు భార్య) సురేఖ.. చిరంజీవితో పవన్ గురించి మాట్లాడారట. ఆయనను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకెళ్లమని సూచించారట. పవన్‌ను కూడా ఆమె బలవంతంగా ఒప్పించారని ఆయనే స్వయంగా వెల్లడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎంట్రీ అదిరిపోవాలనుకుని... సురేఖ ప్రోద్బలంతో పవన్ సినిమాల్లోకి రావడానికి సిద్దం అయ్యాడు. అయితే, తన ఎంట్రీ అల్లాటప్పాగా ఉండకూడదని అనుకున్న పవర్ స్టార్.. అందుకోసం ఎన్నో శిక్షణలు తీసుకున్నాడు. 


ఆ తర్వాత అంటే 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇందులో తన మార్షల్ ఆర్ట్ సత్తాను చూపించాడు. ఇలా తన 23 ఏళ్ల సినీ కెరీర్‌లో 23 సినిమాల్లో హీరోగా నటించాడు. పవన్ చివరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి'. సినిమాలకు గుడ్‌బై 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు. 


ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిపోయింది. ఆ తర్వాత అంటే 2014 మార్చి 14 న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు. అప్పటి నుంచి సినిమాలకు దూరమయ్యాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: