దేశవ్యాప్తంగానే కాకుండా మలేషియా నేపాల్ లాంటి చిన్న దేశాలో కూడ ఈ రోజు వినాయక చవితి  పండుగ సంబరాలు  చాలా ఘనంగా జరుగుతున్నాయి. రకరకాల రూపాలతో భారీ వినాయక విగ్రహాలు తయారు చేయడం ఈ పండుగ   ప్రత్యేకత పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతులను వాడాలని ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో ముంబైలోని  ప్రఖ్యాత గౌడ సారస్వత్ బ్రాహ్మిణ్  సేవా మండల్ మాత్రం రసాయన రంగుల మిశ్రమానికి బదులుగా ఏకంగా బంగారాన్ని పూతగా పూసి ఒక వినాయక  విగ్రహాన్ని తయారుచేయడం  సంచలన వార్తలకు కేంద్రంగా మారింది.    

ఈ బంగారు గణపతి భక్తులకు దర్శనం ఇవ్వడానికి రెడీ  అయి పోయాడు. ఈ రోజు  సాయంత్రం  నుండి భక్తుల దర్శనానికి ఈ బంగారు గణపతి రెడీ అయిపోతున్నాడు. అయితే ఈ  వినాయక మండపాన్ని ఏకంగా 266 కోట్లకు భీమా చేయడం ఇప్పుడు షాకింగ్ నేస గా మారింది.  ప్రతి ఏటా ముంబైలోని మాతుంగలో గల కింగ్ సర్కిల్ లో జీఎస్బీ సేవా మండల్ గణేషుడి మండపాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.  

ఉగ్రవాదులు దాడి చేసినా మత కల్లోలాల సందర్భంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాసంభవించే ప్రాణనష్టాన్ని దృష్టిలో ఉంచుకుని జీఎస్సీ నిర్వాహకులు మండపానికి వచ్చే ప్రతి భక్తుడికీ కుడా 20 కోట్ల రూపాయల భీమా సౌకర్యాన్ని ఈ కమిటీ నిర్వాహకులు కల్పించారు. ఈ తొమ్మిది రోజుల్లో కనీసం కోటి మందికి పైగా భక్తులు ఈ మండపానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు  

 2500 మంది యువతీ యువకులు ఈ మండపంలో తొమ్మిదిరోజుల పాటు వాలంటీర్లుగా పనిచేస్తారని తెలిస్తే ఈ మండపాన్ని ఎలాంటి భారీ స్తఃయి లో నిర్మిచారో అర్ధం అవుతుంది. ఈ మండపంలోని వినాయకుడిని చూడటానికి ఒక్క ముంబైలోని వారు మాత్రమే కాకుండా దేశ విదేశాలలోని ప్రజలు వస్తారు అంటే ఈ బంగారు వినాయకుడి   క్రేజ్  ఏ స్థాయిలో ఉందొ అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: