ఓవర్సీస్ లో అరుదైన ఘనత సాధించాడు ప్రభాస్. వరుసగా మూడు సార్లు 2 మిలియన్ క్లబ్ లో చేరిన హీరోగా రికార్డు సృష్టించాడు. టాలీవుడ్ నుంచి ఇప్పటివరకు ఏ హీరోకు ఇలా వరుసగా 3 సార్లు 2 మిలియన్ క్లబ్ లో చేరడం సాధ్యం కాలేదు. ప్రభాస్ నటించిన సాహో సినిమా తాజాగా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరవ్వడంతో ఈ రికార్డు సాధ్యమైంది. 


ఇంతకుముందు ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు 2 మిలియన్ క్లబ్ లోకి చేరగా.. ఇప్పుడు సాహో కూడా వాటి సరసన చేరింది. ఆదివారం నాటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 20 లక్షల 80వేల 694 డాలర్ల వసూళ్లు వచ్చాయి. 


అటు నార్త్ లో కూడా సాహో హవా కొనసాగుతోంది. విడుదలైన ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు అటుఇటుగా 80 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. నిన్నటితో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈరోజు కూడా ఈ సినిమాకు ఉత్తరాదిన భారీ ఆక్యుపెన్సీ వచ్చే అవకాశం ఉందంటోంది ట్రేడ్.


నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది సాహో. కానీ ఈ మూవీకి ఈరోజు కూడా కలిసొచ్చింది. వినాయక చవితి హాలిడే కావడంతో ఈరోజు కూడా సాహోకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంకేతంగా అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. 

సాహో సినిమాకు విపరీతమైన డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్గా బాగానే సాగుతుంది అని వినికిడి. ఏదేమైనప్పటికీ ఈ వినాయక చవితి నాడు ప్రభాస్కు మనందరం ముందు ఉన్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఏ విఘ్నాలు వాటిల్లకుండా వినాయకుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ వినాయక చవితి విషెస్ తెలుపుదాం.


మరింత సమాచారం తెలుసుకోండి: