ప్రభాస్ సాహో మూవీ ఆగష్టు 30 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ వచ్చిందో చెప్పక్కర్లేదు.  సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు.  కానీ, సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా పడిపోయింది.  భారీ ఖర్చు పెట్టి సినిమా తీశారు అన్నారు.. ఆ స్థాయిలో సినిమా లేదని, చిన్నపిల్లలా గ్రాఫిక్స్ లా ఉన్నాయని ట్రోల్ చేశారు.  సినిమాను ఎంతలా ఆడుకోవాలో అంతలా ఆడుకున్నారు.  ఎలాంటి ట్రోల్స్ చేయాలో అలా చేశారు.  


అంతలా ట్రోల్స్ చేస్తున్నా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకు ప్రదర్శిస్తూ వచ్చింది.  వరసగా సెలవులు కావడంతో సినిమాకు కలిసి వచ్చింది.  సోమవారం సైతం సెలవు కావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది.  నాలుగు రోజుల్లో 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది ఈ సినిమా.  అటు బాలీవుడ్ లో 100 కోట్లు వసూలు చేసింది.  నెగెటివ్ టాక్ తో సంబంధం లేకుండా సినిమా వసూళ్లు సాధించడం విశేషం.  .


ఇక ఇదిలా ఉంటె, ఈ మూవీ ఈరోజు నుంచి అసలు పరీక్షను ఎదుర్కోబోతున్నది.  సాధారణంగా వీక్ డేస్ లో కలెక్షన్లు తక్కువగా ఉంటాయి.  సినిమా బాగుంటే 70 నుంచి 80 శాతం కలెక్షన్లు రావొచ్చు.  కానీ, సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఈ కలెక్షన్లు ఏ స్థాయిలో డ్రాప్ అవుతాయో చూడాలి.  ఒకవేళ 50 నుంచి 60శాతం కలెక్షన్లు వస్తే.. రెండో వీకెండ్ వరకు నష్టాల నుంచి కొద్దిమేర తప్పించుకునే ఆవకాశం ఉంటుంది.  


అలా కాకుండా ఏదైనా తేడా వచ్చి కలెక్షన్లు ఇంకా డ్రాప్ అయితే మాత్రం సినిమాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు చేయడంతో సినిమాకు మైనస్ గా మారింది.  బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో దీనికి ఎంత ఖర్చు చేసినా తిరిగి వస్తాయనే నమ్మకంతో నిర్మాతలు ఖర్చు చేశారు.  ఈ డబ్బులు వెనక్కి వస్తాయా రావా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉన్నది.  హాలిడే ట్రిప్ నుంచి ప్రభాస్ అర్ధాంతరంగా వెనక్కి వచ్చేశారు.  సినిమా ప్రమోషన్స్ విషయంలో సపోర్ట్ చేయబోతున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: