అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో భారీ విజయం సాధించింది.  ఈ సినిమా విజయంతో ఆఫర్లు వస్తాయని ఎదురు చూసింది.  ఎన్నిసార్లు ఎదురు చూసినా చివరకు ఆమెకుమిగిలింది ఏమిలేదు.  118 సినిమాలో ఓ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.  మహానటి సినిమాలో ఓ రోల్ చేసింది.  ఆ తరువాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. విజయ్ దేవరకొండకు మాత్రం వరసగా ఆఫర్లు వస్తున్నాయి. పెద్దపెద్ద సినిమాలు చేస్తున్నారు.  


విజయ్ కు ఆఫర్లు వచ్చినా... గీతగోవిందం మినహా మరో సినిమా ఆడలేదు.  ప్రస్తుతం ఈ హీరో కొన్ని సినిమాలు చేస్తున్నాడు.  రీసెంట్ గా వచ్చిన డియర్ కామ్రేడ్ కూడా బొక్కబోర్లా పడింది.  అయితే, అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేకు రీసెంట్ గా బాలీవుడ్ నుంచి అఫర్ వచ్చింది.  బాలీవుడ్ లో ఆమెకు క్రేజీ అఫర్ అని చెప్పొచ్చు.   యశ్ రాజ్ ఫిలిమ్స్ లో మూడు సినిమాలు చేయడానికి ఆమెతో ఒప్పందం కుదిరింది.  


అందులో ఒక సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నది.  రణవీర్ సింగ్ హీరో.  గాలిబాయ్ తరువాత ఈ హీరో 83 సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమ తరువాత యశ్ రాజ్ ఫిలింస్ లో సినిమా చేయాల్సి ఉన్నది. బాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ సంస్థ కావడం.. అందులో మూడు సినిమాలు చేయడానికి షాలినికి అవకాశం దొరకడం విశేషం.  అర్జున్ రెడ్డి సినిమా తరువాత కాస్త లావు అయ్యింది.  పైగా సరైన పిఆర్ ఆమెకు దొరకడం లేదు.  


దీంతో ఎలా అప్రోచ్ కావాలో తెలియదు.  ఫిట్నెస్ కోసం జిమ్ కు వెళ్ళి క్యాలరీలు కరిగించి ఫిట్ గా తయారైంది.  సరైన సమయంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ ను అప్రోచ్ కావడం.. ఆ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి అవకాశం రావడం అన్ని ఒకేసారి జరిగిపోయాయి.  దీంతో షాలిని పాండేకు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.  ఇలా వచ్చిన ఈ అవకాశం ఆమెను మరో స్థాయికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: