టాప్ హీరోలు కేవలం తమ ఇమేజ్ ని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా తమ క్రేజ్ ను పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో అలాగే ఉత్తరాది హిందీ రాష్ట్రాలలో పెంచుకోవడానికి అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ ను అనుసరిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడ నేషనల్ స్టార్ ఇమేజ్ కోసం ‘ఆర్ ఆర్ ఆర్’ ను ఒక ఆయుధంగా మార్చుకోబోతున్నాడు. 

వచ్చే సంవత్సరం విడుదల కాబోతున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. దీనితో జూనియర్ ఈ సినిమాకు సంబంధించిన హిందీ తమిళ కమ్మడ మళయాళ వెర్షన్స్ కు తానే తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు టాక్. 

జూనియర్ కు చిన్నప్పటి నుండి తమిళ కన్నడ భాషలతో పాటు హిందీ కూడ బాగా అర్ధం అవుతుంది. తనకు తెలిసిన ఆ భాషల పై మరింత పట్టు సాధించడానికి ఇప్పటికే జూనియర్ ఈ భాషలకు సంబంధించి కొంతమంది ట్యూటర్స్ ను పెట్టుకుని తనకు సంబంధించి ఆ భాషల పై మరింత పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసాడు అని తెలుస్తోంది.

ఈ పరిస్థితులలో వచ్చేనెల అక్టోబర్ 22న కొమరం భీం జయంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోష్టర్ ను విడుదల చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోష్టర్ లో ఈమూవీలో కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న జూనియర్ డైలాగ్ కూడ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అన్ని భాషలలోను ఆ భాషకు సంబంధించిన డైలాగ్ ను జూనియర్ స్వయంగా చెప్పబోతున్నాడు. ఈ ప్రయోగం క్లిక్ అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి అన్ని భాషల డబ్బింగ్ ను జునియర్ తానే తన సొంత గొంతుతో చెప్పబోతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: