తెలుగులో తన కామెడీ టైమింగ్ తో నువ్వులను తెప్పిస్తూ దూసుకుపోతున్న హీరో విక్టరీ వెంకటేష్.. ఈయన సినిమా అన్ని చాలా వరకు హిట్ ట్రాక్ ను కైవసం చేసుకున్న సినిమాలే.. ఇకపోతే ఈ సినిమా అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన సినిమాలే. సీనియర్ నటులతో కలిసి అయన చేసిన చేసిన హంగామా అంతా ఇంతా కాదనుకోండి. ఈయన సినీ జీవితంలో చాలా సినిమాలు వరుస హిట్ టాక్ తో కలెక్షన్స్ రాబట్టినవే.

వెంకీ చేసిన చాలా సినిమాలు కామెడీకి ఆద్యం పోసిన సినిమాలే కావడం విశేషం. అయితే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు, చింతకాయల రవి, సినిమాలు మినహా మొన్న వచ్చిన సినిమా ఎఫ్ 2 లో లేట్ వయసులో పెళ్లి చేసుకున్న కూడా రొమాన్స్ కు ఏ మాత్రం తీసిపోనని మరో సారి నిరూపించాడు. అయితే, మల్టీస్టారర్ కథతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కైవసం చేసుకోవడంతో,  మరోసారి మల్టీస్టారర్ కథతో వచ్చిన సినిమాలోనటించారు. రియల్ లైఫ్ అల్లుడితో మరో సారి వెంకీ మామ  స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. 

ఈ సినిమాలో యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా, చైతు కి జోడిగా రాశికన్నా యాక్ట్ చేయగా, మన వెంకీకి జోడిగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్  చివరి దశలో ఉంది. మొన్న వినాయక చవితి సందర్బంగా ఈ సినిమాలోని మరో పోస్టర్ ని రిలీజ్ చేసింది. 

ఈ సినిమాకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళ అభిమానులు నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ కన్నుల పండగనే చెప్పాలి. అందరికి కళ్ళల్లో ఆనడం చూస్తున్న వెంకీకి మాత్రం పాయల్ కునుకు లేకుండా చేస్తుంది. అసలు విషయమేంటంటే.. ఈ సినిమా చేస్తూనే వేరే అడల్ట్, బోల్డ్ సినిమాలను లైన్లో పెట్టింది. దానికి ఉదాహణ మొన్న వచ్చిన ఆర్ డి ఎక్స్ లవ్ సినిమానే.  ఆ సినిమాతో మితిమీరి పోయిన పాయల్ అందరి నోట్లో నానుతుంది. అలాంటి పాయల్ వెంకీ సరసన నటించడం వల్ల సినిమాకు ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అని వెంకీ బయపడుతున్నాడు.  ఏది ఏమైనా కూడా అందరి కన్ను ఈమె మీద పడితే ఈమె కన్ను మాత్రం వెంకీని కోరుకుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: