ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా శుక్రవారం రోజు విడుదలైంది. సినిమాపై భారీగా అంచనాలు ఉండటంతో వీకెండ్ వరకు సాహో టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. సోమవారం రోజు వినాయకచవితి పండుగ కావటంతో సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ నిన్నటి నుండి వర్కింగ్ డేస్ కావటంతో సాహో సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావట్లేదు.బాలీవుడ్, నైజాం, సీడెడ్, ఆంధ్రా ఏరియాలలో సాహో సినిమా కలెక్షన్లలో భారీగా డ్రాప్ కనిపిస్తోంది. 
 
బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ప్రభాస్ మార్కెట్ పెరగటం నిజమే కానీ ప్రభాస్ సరైన కథను ఎంచుకున్నప్పుడు మాత్రమే విజయం వస్తుందనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు టాలీవుడ్, బాలీవుడ్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ప్రభాస్ ఇకముందైనా కథల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. 
 
సాహో సినిమా టెక్నికల్ విషయాల్లో బాగానే ఉన్నా కథ, కథనాల్లో లోపాల వలన సినిమాకు బిలో యావరేజ్ టాక్ వచ్చింది. ప్రభాస్ కథల విషయంలో జాగ్రత్త వహిస్తే బాలీవుడ్ మార్కెట్లో కూడా ప్రభాస్ సినిమాలు రికార్డులు సాధించే అవకాశం ఉంది. బిలో యావరేజ్ టాక్ వచ్చిన సినిమాతోనే ప్రభాస్ బాలీవుడ్ లో 100 కోట్ల రుపాయల నెట్ వసూళ్ళు సాధిస్తే సినిమాకు హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో ఊహించుకోవచ్చు. 
 
ప్రభాస్ ప్రస్తుతం జాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తప్ప మరే కొత్త సినిమాకు ప్రభాస్ కమిట్ అవలేదు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సాహో సినిమాను నిర్మించిన యువి క్రియేషన్స్ బ్యానర్ పైనే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారని సమాచారం. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: