ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుత్న్నది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గెరియాలో జరుగుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మల్టీస్టారర్ గా చేస్తున్నారు.  ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుంటే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్.  


ఇదిలా ఉంటె, ఎన్టీఆర్ హీరోయిన్ గా ఎవర్ని సెట్ చేశారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.  ఎన్టీఆర్ కోసం ఇప్పటికే ఇద్దరు ఫారెన్ అమ్మాయిలను చూసిన సెట్ కాలేదు.  బల్గెరియా షెడ్యూల్ తరువాత ఎన్టీఆర్ హీరోయిన్ ను సెట్ చేసే అవకాశం ఉన్నది.  ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్, చరణ్ లు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  


ఈ సినిమా కోసం ఎన్టీఆర్, చరణ్ లకు 25కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారని వినికిడి.  మాములు సినిమాలకు వీరు 15కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.  కానీ, ఇది సంథింగ్ స్పెషల్ సినిమా కావడంతో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  


పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ఏ మాత్రం రాజీ పడటం లేదు.  భారీ సినిమాగా వచ్చిన సాహో ఫెయిల్ కావడం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేస్తున్నది.  సాహో ప్రభావం మిగతా సినిమాలపై పడకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.  భారీ చిత్రాల విషయంలో ఒకటికి రెండుసార్లు అలోచించి రంగంలోకి దిగితే మంచిది.  లేదంటే సాహో లాగా ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: