సాహో సినిమా భారీ విజయం సాధిస్తుందని అనుకున్నారు.  తీరా రిలీజ్ అయ్యాక చూసుకుంటే.. సీన్ రివర్స్ అయ్యింది.  భారీ ఫెయిల్ అయ్యింది.  ఫెయిల్ కావడంతో సినిమాపై ఉన్న అంచనాలు తలక్రిందులయ్యాయి.  వెయ్యి కోట్లు వస్తాయి అనుకుంటే కనీసం పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా రావా అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.  దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు మమ్మురం చేసింది. 

ప్రయత్నాలు చేస్తున్నది గాని, నష్టాల నుంచి బయటపడటం అసాధ్యం అని చెప్పాలి.  దర్శకుడు సుజిత్ సినిమాను మరోసారి చూడమని అంటున్నారు.  ఒక్కసారి టికెట్ కొని చూడటానికి నన ఇబ్బందులు పడ్డారు.  కారణం ఏంటి.. టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడమే.  ఇలా ధరలు అమాంతం కొండెక్కి కూర్చోవడంతో పాపం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు.  


సాహో ఫెయిల్ కావడం సైరాపై దాని ప్రభావం ఉంటుందా అనే దాని గురించి అందరు ఆలోచిస్తున్నారు.  సైరా చారిత్రాత్మక కథతో తెరకెక్కింది.  కథ బాగున్నా దాన్ని దర్శకుడు ఎలా తెరకెక్కించారు అన్నది చూడాలి.  సాహో సినిమా విషయంలో కూడా అలానే అనుకున్నారు.  సుజిత్ మేకింగ్ అదుర్స్.. తురుము.. అని పొగిడేశారు.  చివరకు సినిమాకు వెళ్తే అక్కడ ఏముందో తెలియడం లేదు.  


సురేందర్ రెడ్డి ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేశారు.  యాక్షన్ పార్ట్ ను తెరక్కించడంలో సిద్ధహస్తుడు.  సైరా స్వాతంత్ర సమరయోధుడి చరిత్ర కావడంతో సినిమాపై నమ్మకం ఉన్నది.  పైగా ఇది పాన్ ఇండియా మూవీ.  అమితాబ్ వంటి సూపర్ స్టార్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.  కొన్ని ఏరియాల్లో ఇప్పటికే బిజినెస్ కూడాజరిగింది.  సాహో ఫెయిల్ ను పట్టించుకోకుండా సైరా సినిమాను భారీ మొత్తానికి హక్కులను చేజిక్కించుకుంటున్నారు. బిసినెస్ విషయంలో సాహో, ఆర్ఆర్ఆర్ సినిమా బిజినెస్ లను దాటిపోయింది సైరా.  


మరింత సమాచారం తెలుసుకోండి: