సాహో సినిమా రిలీజ్ కు ముంది భారీ హైప్ వచ్చింది.  సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఊహించుకున్నారు.  కానీ, సినిమా రిలీజ్ తరువాత, మొత్తం రివర్స్ అయ్యింది.  సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.  ఈ డివైడ్ టాక్ రావడంతో సినిమా కల్లెక్షన్లపై ప్రభావం పడింది.  భారీ స్థాయిలో కలెక్షన్లు ఉంటాయని అనుకుంటే దారుణంగా పడిపోయాయి.  


అయితే, మొదటి నాలుగు రోజులు సెలవులు కావడంతో సినిమాకు కలిసి వచ్చింది.  నాలుగు రోజుల్లో సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  ఐదో రోజుకూడా సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.  ఐదో రోజున మంచి కలెక్షన్లు రాబట్టి మొత్తంగా ఐదు రోజుల్లో 350 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.  ఆరో రోజుకు కూడా కలెక్షన్లు పర్వాలేదన్నట్టు తెలుస్తోంది.  


సాహో సినిమా నైజాంలో తన జోరుకు కొనసాగిస్తోంది.  ఐదు రోజుల్లో 25 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసిన సాహో, ఆరో రోజు కూడా అదే దూకుడును ప్రదర్శించింది.  ఆరో రోజు 0.60 కోట్లు వసూలు చేసింది.  మొత్తంగా నైజాం ఏరియాలో సాహూ  ఆరు రోజుల్లో 25.60 కోట్ల షేర్ ను వసూలు చేసింది.  నైజాంలో 25 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసిన సినిమాల్లో సాహో ఐదో సినిమా.  


తాజా సమాచారం ప్రకారం.. సాహూ లాంగ్ రన్ లో తప్పకుండా రూ. 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ దాదాపు 370 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  బాలీవుడ్లో మాత్రం సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది.  బాలీవుడ్ లో ఇప్పటికే వందకోట్ల రూపాయల క్లబ్ లో చేరింది సినిమా.  బాగా లేదన్న సినిమానే ఈ స్థాయిలో వసూళ్లు రాబడితే ఏ మాత్రం బాగుంది టాక్ వచ్చినట్టయితే.. ఇప్పటికి టికెట్స్ దొరికేవి కావేమో.   


మరింత సమాచారం తెలుసుకోండి: