గత శుక్రవారం విడుదలైన సాహో సినిమాకు రిలీజ్ రోజున బిలో యావరేజ్ టాక్ వచ్చింది. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా నచ్చినప్పటికీ సాధారణ ప్రేక్షకుల్ని మాత్రం సాహో సినిమా ఆకట్టుకోలేకపోయింది. విడుదలకు ముందు సాహో సినిమాపై భారీగా అంచనాలు ఉండటంతో వీకెండ్ వరకు టికెట్లు అన్నీ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. వినాయకచవితి పండుగ కలిసిరావటంతో సోమవారం కూడా ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. 
 
కానీ మంగళవారం నుండి వర్కింగ్ డేస్ కావటంతో సాహో సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. నిన్న సాహో సినిమా వసూళ్ళలో భారీగా డ్రాప్ వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న సాహో సినిమా నైజాం ఏరియాలో కేవలం 25 లక్షల రుపాయలు మాత్రమే వసూలు చేసింది. వైజాగ్ ఏరియాలో ఈ సినిమాకు కేవలం 22 లక్షల రుపాయలు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా రెండు కోట్ల రుపాయల కంటే తక్కువ షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 
 
బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. మొదటి మూడు రోజులు బాలీవుడ్ లో రికార్డు స్థాయి వసూళ్ళు సాధించిన సాహో సినిమాకు సోమవారం నుండే కలెక్షన్లలో డ్రాప్ కనిపిస్తున్నట్లు సమాచారం. సాహో సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టటంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన పడుతున్నారని తెలుస్తుంది. తెలుగులో సెప్టెంబర్ 13 వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలయ్యేదాకా సాహో సినిమాకు పోటీనిచ్చే సినిమా లేకపోవటం మాత్రం సాహో సినిమాకు కలిసొచ్చే అంశం. 
 
టాలీవుడ్లో సాహో సినిమాను 125 కోట్ల రుపాయలకు అమ్మారు. ఇప్పటివరకు ఈ సినిమాకు 80 కోట్ల కంటే తక్కువగా షేర్ వచ్చినట్లు తెలుస్తుంది. సాహో సినిమా హిట్ అనిపించుకోవాలంటే మరో 45 కోట్ల రుపాయలు వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం సాహో సినిమా మరో 45 కోట్ల రుపాయలు వసూలు చేస్తే మాత్రమే హిట్ అనిపించుకుంటుంది. ఫుల్ రన్లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: