రజినీకాంత్ సినిమాల్లోకి వస్తారు వస్తారు అని ఎప్పటినుంచో టాక్ వస్తున్నది.  రజినీకాంత్ మాత్రం దేవుడు ఆదేశించినపుడు మాత్రమే పాటిస్తానని అంటున్నారు.  కొన్ని రోజుల క్రితం రజినీకాంత్ రాజకీయాల గురించి మాట్లాడారు.  త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు.  కానీ, ఆ ఎంట్రీ ఇప్పుడు ఏంటి అనే విషయాల గురించి పెద్దగా తెలియలేదు.  ఈ విషయం గురించి మరలా ఇప్పుడు చర్చకు వచ్చింది. 


రజినీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న ఈ మూవీ తరువాత శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నది.  కానీ, దర్బార్ సినిమాతో రజినీకాంత్ సినిమాలకు స్వస్తి చెప్పబోతున్నారని, సినిమా రంగం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారని అంటున్నారు.  


రజినీకాంత్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.  25 సంవత్సరాల తరువాత రజినీకాంత్ మరలా పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నారు.  వచ్చే ఏడాది జనవరిలో సినిమా రిలీజ్ కాబోతున్నది.  అంచనాలు భారీగా ఉన్నాయి.  2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు.  కానీ, 2021 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రజినీకాంత్ చెప్పడం విశేషం.  


దర్బార్ చివరి సినిమా అని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది.  దర్బార్ తరువాత పార్టీని ఫామ్ చేస్తారని, ఈ రెండేళ్లు పార్టీని బలోపేతం చేసేందుకు రెడీ అవుతారని తెలుస్తోంది.  అమ్మ జయలలిత, కరుణానిధిలు మరణించిన తరువాత తమిళనాడులో రాజకీయంగా అనిశ్చితి నెలకొన్నది.  డీఎంకే మెరుగ్గా ఉన్నా అంతర్గత పోరు ఎక్కువగా ఉన్నది.  ఇది ఆ పార్టీని ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పాలి. కమల్ హాసన్ పార్టీ ఇప్పుడే పుట్టింది కాబట్టి పట్టు సాధించే సరికి సమయం పడుతుంది.  సో, రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ...  తమిళనాడు మొత్తం షేక్ కావడం ఖాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: