గత శుక్రవారం విడుదలైన సాహో సినిమాకు ప్రేక్షకుల నుండి బిలో యావరేజ్ టాక్ వచ్చింది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లో మాత్రమే బ్రేక్ ఇవెన్ అయింది. బాలీవుడ్ లో సాహో థియేట్రికల్ రైట్స్ 70 కోట్ల రుపాయలకు అమ్ముడవగా ఐదు రోజుల్లోనే 70 కోట్ల రుపాయల షేర్ సాధించి రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా థియేట్రికల్ రైట్స్ 125 కోట్ల రుపాయలకు అమ్ముడయ్యాయి. 
 
ఆరు రోజుల్లో సాహో సినిమాకు కేవలం 72 కోట్ల రుపాయల షేర్ వచ్చింది. మొదటి నాలుగురోజులు సాహో సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ మంగళవారం నుండి సాహో సినిమా కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. నిన్న సాహో సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రుపాయల షేర్ వసూళ్ళు మాత్రమే వచ్చాయి. సినిమా హిట్ అవ్వాలంటే మరో 50 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. 
 
కానీ ప్రస్తుతం సాహో సినిమాకు వస్తున్న కలెక్షన్లను చూస్తుంటే ఈ టార్గెట్ రీచ్ అవ్వటం అంత తేలిక కాదని తెలుస్తోంది. కర్ణాటకలో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు పరవాలేదనిపించేలా ఉన్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం సాహో సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్లే అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో సాహో సినిమా వసూళ్ళు దారుణంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయని తెలుస్తోంది. 
 
సాహో సినిమాకు నిర్మాతలు 350 కోట్ల రుపాయలు ఖర్చు పెట్టారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 300 కోట్ల రుపాయలకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల రుపాయల షేర్ రాగా మరో 100 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. మరి ఫుల్ రన్లో సాహో సినిమా ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: