గత శుక్రవారం విడుదలైన సాహో సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. సాహో సినిమా డైరెక్టర్ సుజీత్ సాహో సినిమా గురించి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుజీత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షార్ట్ ఫిల్మ్స్ తీయటానికి డబ్బులు లేకపోతే సెల్ ఫోన్ ఉపయోగించి సినిమాలు తీసేవాణ్ణి. అలాంటి స్టేజ్ నుండి సాహో అనే భారీ సినిమా తీస్తానని నేనెప్పుడూ ఊహించుకోలేదు. కష్టపడే స్వభావం మాత్రం నాలో చాలా ఉంది. ఆ స్వభావమే నాకు ఈ గౌరవం తెచ్చిపెట్టింది. 
 
సాహో సినిమా కథలో ఎటువంటి మార్పులు చేయలేదు. మార్పులు చేస్తే కథ మొత్తం మారిపోతుంది. సాహో సినిమాకు రివ్యూలు అటూ ఇటూ వచ్చాయి. ప్రేక్షకుల నుండి స్పందన మాత్రం వేరే విధంగా ఉంది. సినిమా కోసం పడిన కష్టం ఎక్కడికీ పోదని మరోసారి అర్థమైంది. రన్ రాజా రన్ సినిమా సమయంలో సమీక్షకులు అందరూ సినిమాను మెచ్చుకున్నారు. సాహో లాంటి పెద్ద సినిమాల విషయంలో మాత్రం ఒక పూట ఆగి రివ్యూ ఇస్తే బాగుంటుంది. ప్రేక్షకులకు కొద్దిగా ఆలోచించుకునే సమయం ఇవ్వాలని అన్నారు. 
 
సుజీత్ మాట్లాడుతూ సమీక్షల ప్రభావం సినిమాపై ఖచ్చితంగా ఉంటుంది. సినిమాకు ఇంత సమయం ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని ప్రేక్షకులు సమీక్షలు చూసి నిర్ణయం తీసుకుంటారు. నెల రోజులు ఎదురు చూస్తే అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది కదా అనే ధీమా కూడా ఉంది. మంచి సినిమాల్ని సమీక్షలు బతికించాయి అనే విషయం కూడా మర్చిపోకూడదని సుజీత్ అన్నారు. 
 
సినిమాపై వస్తున్న కాపీ ఆరోపణలకు స్పందిస్తూ లార్గో వించ్ అనే సినిమాను నేను ఇప్పటివరకు చూడలేదు. రన్ రాజా రన్ సినిమా కథనే కొద్దిగా మార్చి సాహో సినిమాను తీసాను. బీహార్ నుండి చాలా మంది ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. ప్రేక్షకులు సాహో సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. సాహో సినిమాకు వస్తున్న కలెక్షన్లే అందుకు సాక్ష్యం అని సుజీత్ అన్నారు. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: