యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో వారం రోజుల బాక్సాఫీస్ ర‌న్‌ కంప్లీట్ చేసుకుంది. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా మొదటి వీకెండ్లో ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొట్టింది. సోమవారం వినాయక చవితి కూడా కలిసి రావడంతో సాహోకు కొంతవరకు ప్లస్ గా మారింది. అయితే ఐదో రోజు నుంచే ఈ సినిమా వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి.


హిందీలో ఈ చిత్రం దాదాపు రూ. 120 కోట్ల నెట్ వసూళ్ళతో హిట్ అనిపించుకుంది. బాలీవుడ్‌లో బాహుబ‌లి సీరిస్ సినిమాల‌తో ప్ర‌భాస్‌కు వ‌చ్చిన క్రేజ్ ఈ సినిమాకు ఎంతో యూజ్ అయ్యింది. హిందీ వ‌ర‌కు బాగున్నా మిగిలిన వెర్ష‌న్లు మాత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తున్నాయి. తమిళ వెర్షన్ మొదటి నుంచి రెస్పాన్స్ తక్కువే ఉంది.. ఇప్పటికే డిజాస్టర్ అని ట్రేడ్ పండితులు తేల్చారు.


క‌న్న‌డంతో పాటు అటు మ‌ళ‌యాళంలోనూ ఈ సినిమా అనుకున్న స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు. ఇక తెలంగాణ‌లో రూ.27 కోట్ల షేర్ వ‌చ్చినా మ‌రో రూ.13 కోట్లు రాబ‌ట్ట‌డం అసాధ్య‌మే. ఏపీలోనూ అన్ని జిల్లాల్లోనూ భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు. బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే సినిమా మరో యాభై కోట్లు కలెక్ట్ చేయాలి.  ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అది చాలా కష్టం.


సాహో ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్ల‌లో)


నైజామ్ -  26.24


ఉత్తరాంధ్ర -  8.94


సీడెడ్ - 10.79


కృష్ణ -  4.69


గుంటూరు - 7.44


ఈస్ట్ - 6.92


వెస్ట్ - 5.32


నెల్లూరు -  3.90
--------------------------------------
ఏపీ + తెలంగాణా = రూ. 74.24
--------------------------------------



మరింత సమాచారం తెలుసుకోండి: