చంద్రబాబు నాయుడు ఈ పేరు వింటే ఏపిలో 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తలమునకలైన వ్యక్తిగా గుర్తుకు వస్తారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చేసి..నూతన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూశారు చంద్రబాబు.  అయితే ఆయన ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయట. అందులో ఒకటి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ఒకటి.  ఈ మూవీలో స్వర్గీయ ఎన్టీఆర్ ని ఎలా వెన్నుపోటు పొడిచారు అన్న అంశాన్ని చూపించారు. 

ఎన్టీఆర్ కి నమ్మకస్తుడిగా ఉంటూ రాజకీయ సమీకరణ చేసి అప్పట్లో చంద్రబాబు రాజకీయంగా ఎంత దెబ్బ కొట్టారు అన్న విషయాన్ని చూపించారు రాంగోపాల్ వర్మ.  అయితే ఈ మూవీ అప్పట్లో ఏపీలో రిలీజ్ కానివ్వకపోవడం కూడా ఆయనకు మైనస్ పాయింట్ అయ్యింది.  ఏపిలో తప్ప ఇతర అన్ని రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ కావడం..పెద్ద సంచలనం రేపింది. తాజాగా ఇప్పుడు వర్మ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్దమవుతున్నారు.  `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` అంటూ మరో సినిమాని ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మార్క్ ప్రచారార్భాటంతో టైటిల్ జనాల్లోకి దూసుకెళ్లింది.ఇప్పటికే టైటిల్ పై లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమాలో వర్తమాన రాజకీయ నాయకుల్ని ఏ కోణంలో చూపించబోతున్నాడో ఇప్పటికే చెప్పేశాడు. 

ఈ మూవీలో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్ని ఆర్జీవీ హైలైట్ చేస్తున్నారు.   అయితే వర్మ నేటివిటీకి ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి కావడంతో అందులో పాత్రలకు తగ్గట్లు ఆహార్యం ఉన్న నటులను తీసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అలాంటి పోలికలు ఉన్నవారినే తీసుకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో చంద్రబాబు- వైయస్ జగన్-  వైకాపా మహిళా నాయకురాలు రోజా- లోకేష్ నాయుడు- నారా బ్రాహ్మణి- నారా దేవాన్ష్- దేవినేని ఉమ- కేసినేని నాని-కోడెల శివ ప్రసాద్- గంటా శ్రీనివాసరావు-సుజనా చౌదరి- అచ్చయ్య నాయుడు- స్పీకర్ తమ్మినేని సీతారాం- స్పీకర్ బుచ్చయ్య చౌదరి- ఎస్పీ గౌతమ్ .. తదితర పాత్రధారుల్ని.. అలాగే జాతీయ స్థాయి నాయకుల్లో భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ- అమిత్ షా తదితర పాత్రలకు డూప్ లను వెతుకుతున్నామని ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో తాజాగా మూవీలో కీలక పాత్రధారి అయిన చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న డూప్ ఫోటోని ఆర్జీవీ సామాజిక మాధ్యమాల్లో రివీల్ చేశారు.``గెస్ చేయండి.. ఈ కొత్త నటుడు ఎవరు? ఎవరి రియల్ లైఫ్ పాత్రలో నటిస్తున్నాడు?`` అంటూ ఆర్జీవీ ఫ్యాన్స్ కి ఫజిల్ వేశారు. దానికి సమాధానంగా ``ఇప్పట్లో చంద్రబాబును వదిలేట్టు లేవుగా ఆర్జీవీ!`` అంటూ ఓ నెటిజన్ స్పందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: