దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్ళిచూపులు సినిమాతో దర్శకునిగా కెరీర్ స్టార్ట్ చేసాడు. పెళ్ళిచూపులు సినిమా ఘనవిజయం సాధించిన తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాకు తరుణ్ దర్శకత్వం వహించాడు. కానీ ఈ నగరానికి ఏమైంది సినిమా హిట్ కాలేదు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ నిన్న విడుదలైంది. తరుణ్ భాస్కర్ కు జోడీగా మాయ సినిమా ఫేమ్ అవంతిక శర్మ నటిస్తోంది. 
 
యాంకర్ అనసూయ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. మీకు మాత్రమే చెప్తా టీజర్లో హీరోయిన్ అవంతిక శర్మ తరుణ్ భాస్కర్ ను "నువ్వు స్మోక్ చెయ్యవు కదా? డ్రింక్ చెయ్యవు కదా? గంజాయ్ ? గర్ల్స్" అని అడిగితే అన్ని ప్రశ్నలకు తరుణ్ నో అని సమాధానం ఇస్తాడు. కానీ తరుణ్ భాస్కర్ అన్ని పనులు చేస్తుంటాడు. అనసూయ తరుణ్ భాస్కర్ తో "మీలాంటివాళ్ళు బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేస్తారు. కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు. అన్నీ దాచేసి దొరికిపోతే చీటింగ్ కాదంటారు" అని కోపంగా చెబుతుంది. 
 
ఈ కాలంలో యువత మొబైల్ ఫోన్, ఇంటర్ నెట్ ఎలా ఉపయోగిస్తున్నారనే విషయం గురించి వివరిస్తూ సినిమాను పూర్తిగా కామెడీతో నింపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మిస్తూ ఉండటం విశేషం. సమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. 
 
హీరో విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా టీజర్ విడుదలయిన తరువాత " మనకేమైనా రహస్యాలు ఉంటే ఆ రహస్యాలను మన ప్రాణ స్నేహితులకు చెబుతాం. ఆ రహస్యం చికాకు పెట్టించేలా ఉంటే జీవితాంతం స్నేహితులు ఏడిపిస్తూనే ఉంటారు. తరుణ్ భాస్కర్ తన స్నేహితులకు ఎలాంటి రహస్యం చెప్పాడు ? ఆ రహస్యం చెప్పిన తరువాత తరుణ్ భాస్కర్ కు ఎదురైన పరిస్థితులేమిటి ? " అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మీకు మాత్రమే చెప్తా సినిమా చూడాలని విజయ్ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: