‘సాహో’ ఫైనల్ కట్ పూర్తి అయిన తరువాత ప్రభాస్ ఒత్తిడి పై రాజమౌళి ఫైనల్ స్టేజ్ లో ఎంటర్ అయి ‘సాహో’ ను చూసి కొన్ని సూచనలు ఇచ్చాడు అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే సీన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం బల్గేరియాలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పనులలో ఉన్న రాజమౌళి ఈ షూటింగ్ ను ముగించుకుని వచ్చే వారం హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే ‘సైరా’ ఫైనల్ కట్ ను చూడటానికి రాజమౌళి అంగీకరించినట్లు టాక్. 

వాస్తవానికి రాజమౌళి ‘సైరా ఫైనల్ కట్ ను చూడటానికి పెద్దగా ఆసక్తి కనపరచకపోయినా చరణ్ ఒత్తిడితో చిరంజీవికి అసహనం కలగకుండా రాజమౌళి ఒప్పుకున్నాడు అని అంటున్నారు. ఒక సినిమా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిన తరువాత ఆ ఫైనల్ కట్ లో మార్పులు చేర్పులు చెప్పినా పెద్దగా ఫైలితాలు ఉండవు అని రాజమౌళి వ్యక్తిగత అభిప్రాయం అని అంటున్నారు. 

అయితే చిరంజీవి చరణ్ లతో రాజమౌళికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ‘సైరా’ సెన్సార్ కాబోతున్న ఫైనల్ కాపీని వచ్చే వారం జక్కన్న చూడబోతున్నట్లు సమాచారం. ‘సైరా’ నిర్మాణంలో ఎడిటింగ్ లో ప్రతి విషయంలోనూ చిరంజీవి దగ్గర ఉండి ఆ మూవీ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించాడు. 

వాస్తవానికి ఈ మూవీకి సురేంద్రరెడ్డి దర్శకుడు అయినప్పటికీ అన్నీ తానై వ్యవహరించాడు చిరంజీవి. దీనితో చిరంజీవి కనుసన్నలలో నిర్మాణం పూర్తి చేసుకున్న ‘సైరా’ కు ఇప్పుడు రాజమౌళి ఎన్ని మార్కులు ఇస్తాడు అన్నది  ఆసక్తికర విషయంగా మారింది. అయితే చివరి నిముషంలో ‘సాహో’ కు రాజమౌళి ఇచ్చిన సూచనలు ఏమాత్రం కలిసిరాలేదు. అయితే ఇప్పుడు అదే చివరి నిముషంలో ‘సైరా’ కు రాజమౌళి ఇచ్చిన సూచనలు ఎలా ఉపయోగపడతాయో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: