‘సాహో’ మూవీ ప్రభాస్ వీరాభిమానులను కూడ నిరసపరిచిన నేపధ్యంలో ఈ మూవీ బయ్యర్లకు సుమారు 60 శాతం పైగా నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు.   అయితే ఈ సినిమా ఫెయిల్ అయింది అన్నవిషయం దర్శకుడు సుజిత్ పూర్తిగా అంగీకరించ లేకపోతున్నాడు ఒక వైపు తనకు విమర్శకులు అంటే గౌరవం ఉంది అని అంటూనే తన పై విమర్శలు చేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు. 

తన ‘సాహో’ ఫ్రెంచ్ మూవీ ‘లార్గోవించ్‌’ కథకు కాపీ అంటూ తన సినిమాను అర్ధం చేసుకోకుండా అనవసరపు పోలికలు పెడుతున్నారు అంటూ విరుచుకు పడుతున్నారు. అంతేకాదు ‘సాహో’ సినిమాను చూసి బీహార్‌ నుంచి చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు అని చెపుతూ తాము బీహార్ లో పుట్టి ఉంటే గుడి కట్టి ఉండే వాళ్ళమని చెపుతున్నారని ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు.  

ఒక వైపు ‘సాహో’ వల్ల తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లకు 70-80 కోట్లు  నష్టాలు వస్తాయి అని చెపుతున్న పరిస్థితులలో ఇలా సుజిత్ కామెంట్స్ చేయడం ఏమిటి అంటూ ఆశ్చర్యపడుతున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో హీరోలకు హీరోయిన్స్ కు మాత్రమే గుళ్ళు కట్టిన సంఘటనలు ఉన్నాయి. 

ఇప్పుడు నిజంగానే బీహార్ లోని సుజిత్ అభిమానులు అతడికి గుడి కడితే ‘సాహో’ ఫెయిల్ అయినప్పటికీ సుజిత్ దర్శకుడుగా ఒక కొత్త చరిత్రను సృష్టించిన వ్యక్తి అవుతాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రిజల్ట్ పై సుజిత్ తన సన్నిహితులతో వేరే విధంగా స్పందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తాను కోరుకున్న విధంగా తీయలేక పోవడానికి గల కారణం ప్రతి విషయంలోను ‘సాహో’ నిర్మాతలు తనపనిలో వేలు పెట్టి ఈ మూవీ సాధించవలసిన రికార్డులను గుర్తుకు చేయడంతో తాను తన ఏకాగ్రతను ‘సాహో’ విషయంలో మిస్ అయ్యాను అని అంటున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: