ఇప్పటి రోజుల్లో సినిమా ఎలా ఉన్నది అని అడగాలంటే.. కలెక్షన్లు ఎలా ఉన్నాయి అని అడగాల్సిందే. కలెక్షన్లు ఫుల్ గా ఉంటె సినిమా హిట్టయినట్టు లేదంటే ఫెయిల్ అయినట్టే. ఆంధ్రప్రదేశ్ లో స్టార్ హీరోల సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. ఒక్కో హీరోకు ఒక్కో చోట మంచి పట్టు ఉంటుంది. అలాంటి పట్టు ఉన్న హీరోల్లో ఒకరు ఎన్టీఆర్. ఎన్టీఆర్ సినిమాలకు మాస్ లో మంచి పట్టు ఉంది. అంతేకాదు, మాస్ ప్రేక్షకులు ఎక్కువుగా ఉండే ఏరియా సీడెడ్. సీడెడ్ లో ఎన్టీఆర్ సినిమాలు బాగా ఆడుతుంటాయి.
గతంలో వచ్చిన చాలా సినిమాలు అక్కడ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకు ఎంతటి క్రేజ్ వచ్చిందో చెప్పక్కర్లేదు. సినిమా హిట్ ఫెయిల్ తో సంబంధం లేదు. ఎన్టీఆర్ సినిమా అయితే చాలు. ఈ ఏడాది వచ్చిన అరవింద సమేత సినిమా సీడెడ్ లో భారీ కలెక్షన్లు వసూలు చేసింది. నాన్ బాహుబలి రికార్డులు కొల్లగొట్టింది.
అయితే, ప్రభాస్ సాహో సినిమా సీడెడ్ లో కలెక్షన్లు వస్తాయని అనుకున్నారు. కానీ, కలెక్షన్ల పరంగా సినిమా పెద్దగా హిట్ కాలేదు. సాహో ఏడూ రోజులలో పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయింది. సినిమా ఎలాంటి విజయం సాధించింది అన్నది పక్కన పెడితే.. సినిమా మాస్ కు చేరువ కాలేకపోయింది. బాహుబలి సినిమా రేంజ్ వేరు ఈ సినిమా రేంజ్ వేరు. భర్తీ హిట్ అనుకున్న మహర్షి సినిమా కూడా రెండు కోట్ల రూపాయల లాస్ తెచ్చుకుంది.
లాస్ లేకుండా హిట్స్ తెచ్చుకున్న సినిమాలు ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలే కావడం విశేషం. మొదటి నుంచి ఎన్టీఆర్ ఒక్కరికే మాస్ లో మంచి పేరు ఉన్నది. ఎన్టీఆర్ సినిమాలకు సీడెడ్ లో ఆదరణ లభిస్తున్నది. అంతకు ముందు బాలకృష్ణకు సీడెడ్ లో మంచి పేరు ఉండేది. దాన్ని ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోయే ఆర్ఆర్ఆర్ మరోసారి సీడెడ్ లో భారీ వసూళ్లు సాధిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.