మలయాళ సూపర్ స్టార్ అంటే గుర్తొచ్చే పేరు మమ్ముట్టి.. ఇటు తెలుగు అటు తమిళ్ అనే కాకుండా పలు భాషల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అయన ఏ  పాత్ర చేసిన కూడా అందులో ఒదిగి పోయి చేయడం అయన ప్రత్యేకత..ఎప్పుడు స్టార్ అనే ఒక హుందాతనం లేని మంచి మనిషి మమ్ముట్టిగారు..పాత్ర ఏదైనా , భాష ఏదైనా కూడా ఆ పాత్రకే ప్రాణం పోసి నటించే అతి కొద్దిమంది నటులలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి గారు ఒకరు.మమ్ముట్టి పూర్తి పేరు ...ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.  

మమ్ముట్టి స్వాతికిరణం సినిమాలో శిష్యుడిపై ఈర్ష్య, ద్వేషాలు కలిగిన గురువుగా చూపిన నటనను ఎవరూ అంతతేలికగా మర్చిపోలేరు. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటించినా ఆయనకి  పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, అయన నటించిన యాత్ర సినిమా ఆయనకి తెలుగు లో కూడా ఫుల్ క్రేజ్ ని తెచ్చిపెట్టింది.ఈ యాత్ర సినిమా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర నేపథ్యంగా తీసుకోని తెరకెక్కించారు. నాకు వినిపిస్తోంది అంటూ అయన రాజన్న పాత్రలో చూపిన నటనకి  ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. రాజన్న పాత్రలో మమ్ముట్టి ని తప్ప ఇంకెవరిని ఉహించలేనంతగా నటించారు. 

ఇక విషయానికొస్తే.. మలయాళ సూపర్ స్టార్ గా పేరున్న ఈ మమ్ముట్టి గారి పుట్టిన రోజు ఈరోజు. ఎనలేని అభిమానులను పోగేసుకున్న ఈ స్టార్ హీరో కి ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు అయనకు సోషల్ మాధ్యమాల ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయన కుటుంబ సభ్యులు ఆయనకు పుట్టినా రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అయన కుమారుడు, నటుడు అయిన దుల్కర్‌ సల్మాన్‌ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు. రోజూ మీరే మాకు స్ఫూర్తి. మీతో ఉన్నంత సేపూ ప్రేమ, సంతోషంతో సమయం గడిచిపోతుంది. మీరు ఎప్పటికీ గొప్పవారు. ది లెజెండ్‌ అంటూ తన విషెష్ ని తెలియజెప్పాడు. ప్రస్తుతం మమ్ముట్టి  ‘మమాంగం’ చిత్రంలో నటిస్తున్నాడు. జమోరిన్ పాలనలో చావెరుక్కల్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మితమవుతోంది


మరింత సమాచారం తెలుసుకోండి: