తెలుగు బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం మూడో సీజన్ లోకి అడుగుపెట్టి విజయవంతంగా సాగుతుంది. ఈ సీజన్ కి కింగ్  అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ హోస్ట్ గా తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. గత సీజన్స్ లో వచ్చిన విమర్శలని , ఈ సీజన్ లో తనపై రాకుండా గేమ్ ని చాలా చక్కగా ముందుకు తీసుకుపోతున్నాడు. ఇకపోతే గతవారం హోస్ట్ నాగార్జున స్థానంలో రమ్యకృష్ణ వచ్చిన విషయం తెలిసిందే.. ఇక ఈ వారం నాగార్జున హోస్ట్ గా తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు.

అక్కడ్ బక్కడ్ బాంబే బో అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ముందుగా తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వారికీ  థ్యాంక్స్ చెప్పారు. తన బదులుగా రెండు రోజులపాటు హోస్ట్‌గా వ్యవహరించిన రమ్యకృష్ణకు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఆ తరువాత శుక్రవారం రోజు ఏమైందో మన టీవీ లో చూపించాడు. పునర్నవి, వితికా, వరుణ్ సందేశ్ కలిసి రాహుల్ పెళ్లిపై చర్చ మొదలుపెట్టారు. వచ్చే ఒకటి రెండేళ్లలో పెళ్లిచేసుకోవాలని, లేదంటే ఆలస్యమైపోతుందని, 33 సంవత్సరాలు దాటాయంటే లేటయిపోయినట్టే అని రాహుల్‌తో బాబా అన్న విషయాలను వరుణ్ ప్రస్తావించారు. దీనిపై రాహుల్ కూడా స్పందించాడు. అలాగే రవి కూడా అక్కడికి రావడంతో అయన పెళ్లి పై కూడా కాసేపు చర్చ జరిగింది.

ఆ తరువాత బిగ్ బాస్  హౌస్ మేట్స్ కి ఒక  టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఏమిటంటే  రింగులో జాక్ పాట్. టేబుల్‌పై టీఎంసీ స్పాన్సర్ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల బొమ్మలను పెట్టారు. ఈ బొమ్మలపై ఇంటి సభ్యులంతా ఒకరి తరవాత ఒకరు రింగును విసరాలి. ఎవరి రింగులో వస్తువు పడుతుందో వారు తరవాత లెవెల్‌కు ఎంపికవుతారు. రెండో లెవెల్‌లో రింగులో టీఎంసీ వస్తువులు పడిన సభ్యుల పేర్లు చిట్టీలపై ఒక బౌల్‌లో ఉంటాయి. లక్కీ డ్రా ద్వారా కెప్టెన్ బాబా భాస్కర్ ఒక చిట్టీని తీసి విజేతను ప్రకటిస్తారు. విజేత ఇంటికి వారు రింగ్ వేసిన వస్తువును పంపిస్తారు. హౌస్ మేట్స్ అందరూ ఈ టాస్క్ లో పాల్గొనగా ... ఈ టాస్క్‌లో రవి, అలీ రెజా రెండో లెవెల్‌కు వెళ్లారు. వీరిలో లక్కీ డ్రా ద్వారా రవి విజేతగా నిలిచాడు. దీనితో రవి కి ల్యాప్ టాప్ గిఫ్ట్ గా వచ్చింది. 

ఆ తరువాత హౌస్ మేట్స్ ని పలకరించిన నాగార్జున  ....వారితో ఒక టాస్క్ ఆడించాడు. దోషి-నిర్దోషి అనే పేరుతో ఒక టాస్క్ ఆడించాడు.  కెప్టెన్ బాబా భాస్కర్‌ ఈ టాస్క్ లో  పోలీస్ . అలాగే పోలీస్ స్టేషన్ లో  శివజ్యోతి  రైటర్‌. మిగిలిన ఇంటి సభ్యులు వాళ్లకు నచ్చివాళ్లు లేదంటే నచ్చనివాళ్ల మీద ఫిర్యాదు చేయాలి. దానికి సరైన కారణం చెప్పాలి. ఎవరిమీదైతే కంప్లైంట్ చేశారో వాళ్లు దోష, నిర్దోష అనే విషయాన్ని మిగిలిన సభ్యులు బోర్డులు ఎత్తి చూపించాలి. ఫైనల్‌గా కెప్టెన్ బాబా భాస్కర్ తన నిర్ణయాన్ని చెబుతారు. 

ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరూ ఇతర హౌస్ మేట్స్ పై ఫిర్యాదు  చేసారు. వీరిలో ముఖ్యంగా పునర్నవి , అలీ ల మధ్య చాలా గట్టిగా వాదన జరిగింది. ఆ తరువాత మహేష్ ..రాహుల్ పై ఫిర్యాదు చేయగా ..అయన కారణం పై హౌస్ మేట్స్ అందరూ మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ నాగ్ కూడా  రాహుల్ కి  సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా అలీ పై ఫిర్యాదు చేసి ..నాకు రెస్పెక్ట్ కావాలని, ఇంటి సభ్యులు బిహేవియర్‌లో కొంత రెస్పెక్ట్ చూపిస్తే చాలు అంటూ కంటతడి పెట్టింది. ఆ తరువాత ఎలిమినేషన్ ని స్టార్ చేసిన నాగార్జున ..అందరిని యాక్టీవిటీ రూంలోకి తీసుకువెళ్లి .. వారిలో నుండి రాహుల్ సేఫ్ అయినట్టు ప్రకటించాడు. ఇంకా నలుగురు నామినేషన్స్ లోనే ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: