బాహుబలి.. టాలీవుడ్‌ సినీ చరిత్రలో ఒక మరపురాని చిత్రం. అలాంటి బాహుబలిని తెరకెక్కించి టాలీవుడ్ పేరు ప్రఖ్యాతులను ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయేలా చేసాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పుడు తాను ప్రపంచ వ్యాప్తం చేసిన  బాహుబలి ఫార్మూలనే మరోసారి  వాడేందుకు సిద్దమయ్యాడట రాజమౌళి. అందరూ  రాజమౌళి బాహుబలి సినిమాను ఫాలో అవుతుంటే.. రాజమౌళి మాత్రం తన సినిమాను తానే ఫాలో అవడం మరో విశేషం అని చెప్పవచ్చు.  ఇంతకు రాజమౌళి ఏ విషయంలో ఫాలో అవుతున్నాడు అని ఆలోచిస్తున్నారా ...  

ఇకపోతే ప్రస్తుతం ఎస్ ఎస్  రాజమౌళి బాహుబలి సినిమాను ఫాలో అవుతున్న విషయం ఏమిటంటే ... ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమం గురించే. బాహుబలి సినిమాను భారీ ఎత్తున ప్రమోషన్ చేసి బాహుబలిని బంపర్ హిట్ చేసాడు. సినిమా తీయడం అందరూ చేస్తారు కానీ , సినిమా ప్రమోషన్ చేయడం ఒక రాజమౌళికి మాత్రమే తెలుసు అనేలా ప్లాన్ చేస్తాడు.  ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాను కూడా భారీ ఎత్తున రూపొందిస్తున్నాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ఇంకా 11నెలల కాలం ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ రాజమౌళి విడుదల చేయడం లేదు.

సినిమా ప్రమోషన్ కోసమే  ఎక్కువగా సమయం తీసుకునే జక్కన్న ఎందుకు ఇంకా ఆర్ ఆర్ ఆర్ అప్‌డేట్స్ ఇవ్వడం లేదు అంటే ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ప్రమోషన్ కార్యక్రమం ఇస్తే బాగుండదనే కారణం తోనే ఇంకా స్టార్ట్ చేయడంలేదు అని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు విడుదల చేస్తారనే ప్రచారాన్ని పట్టించుకోకుండా కేవలం సినిమా షూటింగ్‌పైనే దృష్టి పెట్టాడు రాజమౌళి. అయితే బాహుబలి తరహాలో సినిమా ప్రమోషన్ కోసం ఆరు నెలల సమయం తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇంకా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ త్వరలోనే ప్రారంభిస్తారనే టాక్ మరోవైపు ఉంది. ఏదేమైనా కూడా స్ట్రాటజీ ఫాలో అవ్వడంలో రాజమౌళి తరువాతే ఎవరైనా అని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: