పవన్ కళ్యాణ్  పుట్టినరోజు పురస్కరించుకుని ‘జనసేన’ కు 100 కోట్ల భారీ విరాళాలు అందచేయాలి అని ప్రయత్నాలు చేసిన పవన్ అభిమానుల ప్రయత్నం పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చింది. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నా సినిమాలను వదులుకొని ‘జనసేన’ కోసం జనం బాటపట్టిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు అతడి అభిమానులు పవన్ కు శుభాకాంక్షలు తెలియచేస్తూ లక్ష ట్విట్స్ చేయడం ఒక సంచలనంగా మారింది.   

ఇది చాలదు అన్నట్లుగా పవన్ అభిమానులు 3 కోట్లకు పైగా జనసేన కోసం విరాళాలు పంపారు. అభిమానులు పంపిన విరాళం పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘నా పుట్టినరోజుకు సందర్భంగా దాదాపు 33 వేలమంది 3 కోట్ల పైన పార్టీ ఫండ్ పంపించారు. వారు ఇచ్చింది పది వంద వెయ్యి ఎంతైనా కావొచ్చు ఆ మొత్తాలకు లెక్కలను నేను తెలియచేయవలసిన అవసరం ఉంది’ అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో ట్విట్ చేసాడు.
 
అంతేకాదు తన అభిమానులు పంపిన విరాళాలను  కొన్ని వేల కోట్లుగా భావిస్తాను అని అంటూ ‘ఇది మనకు ఉన్న శక్తి,  మన  బలం ఇది  కేవలం సినిమాల పరంగా వచ్చింది కాదు. మనం నిజంగా ఏదో ఒకటి చేయాలి’ అంటూ పవన్ తన ట్విట్ ను ముగించాడు. 

వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులలో ఒక రాజకీయ పార్టీ నిర్వహణకు 3 కోట్ల విరాళాలు ఏమాత్రం సరి పోవు. ఎన్నికిలలో పోటీ చేసి ఒక వ్యక్తి ఎమ్ ఎల్ ఏ గా గెలవడానికి కనీసం 20 కోట్లు కావలసి వస్తున్న పరిస్థుతులలో జనసేన కు వచ్చిన ఈ విరాళాలు పవన్ కోరుకునే ధన రహిత రాజకీయలాకు వర్గ రహిత వ్యవస్థకు ఎంత వరకు సరి పోతుందో రానున్న కాలం తెలియ చేస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: