బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూంటాడు. రీసెంట్ గా సైకిల్ తొక్కుకుంటూ షూటింగ్ వెళ్లి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంకా ఈ ఆనందంలోనే మునిగితేలుతున్న అభిమానులకు మరొక వీడియోలో తన చేష్టతో షాక్ ఇచ్చాడు. సైకిల్ తొక్కుతూ షూటింగ్ కు వెళ్లిన సల్మాన్ విషయంలో హ్యాపీగా ఉన్న అభిమానులు ఈ వీడియో చూసి మాత్రం అప్ సెట్ అవుతున్నారు. సల్మాన్ తో పాటు మరో నటుడు అతుల్ అగ్నిహోత్రి కూడా సిగరెట్ తాగుతున్నాడు.

 


సల్మాన్ సిగరెట్ తాగింది ఎక్కడో తెలుసా.. ఓ వినాయకుడి మండపం వద్ద. అందుకే ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. వినాయకచవితి సందర్భంగా సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయకచవితి ఉత్సవాలకు సల్మాన్ హాజరయ్యాడు. సోదరుడు అర్బాజ్ ఖాన్ తో కలిసి ఈ ఉత్సవాల్లో పాల్గొన్న సల్మాన్ అక్కడి మండపం వద్ద సిగరెట్ తాగుతూండగా.. కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అనేక కామెంట్లు వస్తున్నాయి. ఈ కండల వీరుడు ముస్లిం అయినప్పటికీ ప్రతి ఏటా గణపతి ఉత్సవాల్లో పాల్గొనడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూంటారు. కానీ ఈసారి సిగరెట్ తాగడం చూసిన అభిమానులు.. అదీ దేవుడి మండపం వద్ద ఈ ఘటన జరగడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 


మరి దీనిపై సల్మాన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం దబాంగ్ 3 సినిమాలో నటిస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: