అక్కినేని నాగార్జున 60 వసంతాలు పూర్తి చేసుకున్నారు.  తన 60వ పుట్టినరోజును నాగార్జున స్పెయిన్ లో ఇబీజాలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు.  ఇక నాగార్జున బర్త్ డే వేడుకలను కోడలు సమంత దగ్గరుండి పర్వవేక్షించింది.  ఎప్పటి కప్పుడు ఆ విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఆ వేడుకకు కళ తీసుకొచ్చింది.  ఇదిలా ఉంటె, నాగార్జున 60 వేడుక సందర్భంగా తన ఎడమచేతిమీద ఓ టాటూ వేయించుకున్నారు.  


ఆ టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  చేతిమీద వేయించుకున్న ఈ టాటూ కథ ఏంటి.. ఎందుకు ఆ టాటూ వేయించుకున్నారు.  టాటూ కథ ఏంటో తెలుసుకుందాం.  బిగ్ బాస్ షోలో ఈ టాటూ వెనుక ఉన్న రహస్యాన్ని నాగార్జున బయటపెట్టారు.  నాగుపాము తన కుబుసాన్ని విడిచిపెట్టింది.  అలానే తాను కూడా గతం గురించిన విషయాలను పెద్దగా పట్టించుకోను.  వాటిని పక్కన పెట్టారు.  


నాగుపాము పైన ఉన్న కన్ను తనదే అని, జీవితంలో కొత్త విషయాలను వెతుకుతూ ఉంటానన్న గుర్తుకు సంకేతంగా కన్ను బొమ్మ వేయించినట్టు చెప్పారు.  ఇక దిక్సూచి పైన ఎన్ అక్షరం ఉత్తర దిశా..నాగార్జున అనే రెండింటిని సంకేతం అని చెప్పారు.  చివరిగా సంతోషం అనేది గుండెల్లోనే ఉంటుందని చెప్పడం దీని అర్ధం అని నాగార్జున వివరించారు.  ఒక టాటూ వెనుక ఎంత పెద్ద కథ ఉన్నదో.. ఆ టాటూ కూడా అంత పెద్దగా ఉన్నది.  


ఇటీవల కాలంలో టాటూలను వేయించుకోవడం ఫ్యాషన్ అయ్యింది.  శరీరంలో ఎక్కడపడితే అక్కడ టాటూలను వేయించుకుంటున్నారు. ఒకప్పుడు టాటూ వేయించుకోవాలి అంటే భయపడేవారు.  భరించలేని నొప్పి.  కానీ ఇప్పుడు టాటూలకోసం ప్రత్యేకంగా మిషిన్లు అందుబాటులోకి వచ్చాయి.  చిన్నపాటి నొప్పిని భరిస్తే చాలు.. క్షణాల్లోనే కావాల్సిన టాటూ శరీరంలో కలిసిపోతుంది. జీవితాంతం శరీరంలో అలానే ఉండిపోతుంది.  టాటూ అంటే అదే మరి.  అందుకే ప్రతి ఒక్కరు ఫ్యాషన్ కోసం టాటూలను వేయించుకుంటూ ఉంటారు.  ఒక్కోసారి శృతిమించి టాటూలను ఎక్కడపడితే అక్కడ వేయిస్తూ ఉంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: