తెలుగు సినిమాలకు సంబంధించి ఎప్పుడూ ఏదొక అంశంలో వివాదం చెలరేగుతూనే ఉంటుంది. టైటిల్స్, పాటల పదాలు, డైలాగ్స్.. ఇలా వివాదానికి కాదేదీ అనర్హం అన్నట్టు జరుగుతూంటుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'వాల్మీకి' సినిమా విషయంలోనూ ఓ వివాదం నడుస్తూంది. 

 

 

సినిమాకు ఆ టైటిల్ పెట్టడంపై బోయ సంఘాల వారు సినిమా యూనిట్ పై ఆగ్రహంగా ఉన్నారు. 'వాల్మీకి' అనే టైటిల్ పెట్టి వరుణ్ ని విలన్ గా చూపించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై వారు ధర్నాలు చేశారు, కోర్టులో కేసు వేశారు, నిర్మాతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ టైటిల్ పై కోర్టులో కేసు నడుస్తుంది. ఈ విషయంపై ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హరీశ్ శంకర్ స్పందించాడు. చట్టం పరిధిలో ఉన్న విషయం గురించి మాట్లాడకూడదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. బోయ సంఘాలు, వాల్మీకి అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది.. అంటూ విషయం మరీ కాంట్రవర్శీ కాకుండా చేసాడు. వరుణ్ తో ఓ లవ్ స్టోరీ చేద్దామనేది తన ఉద్దేశమని, ఓ స్క్రిప్ట్ కూడా వినిపించానని చెప్పాడు. అనుకోకుండా ఆ కథను పక్కన పెట్టి తమిళ సినిమా జిగర్తాండను రిమేక్ గా 'వాల్మీకి' సినిమా చేసానని తెలిపాడు.

 

 

ఇటీవల రిలీజైన 'వాల్మీకి' ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ లో వరుణ్ డైలాగ్స్, హావభావాలు, అప్పియరన్స్  హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 20న విడుదల కానుంది. మరి ఈ టైటిల్ వివాదం సమసిపోతుందా, బోయ సంఘాలు పట్టు వీడుతాయా లేదా అన్నది సినిమా రిలీజ్ తర్వాత తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: