హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత విలన్ గా కొన్ని సినిమాలు చేసిన గోపీచంద్ ఆ తరువాత యజ్ఞం సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు.  అప్పటి నుంచి వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు.  కెరీర్లో ఎన్నో హిట్స్ అందించిన గోపీచంద్ ఇటీవల కాలంలో సినిమాల విషయంలో వెనకబడి పోయాడు. అయన చేసిన సినిమాలు గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.  


ఒకప్పుడు రేస్ లో ముందున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు వెనకబడి పోవడంతో తిరిగి హీరోగా నిలదొక్కుకోగలడా అనే డౌట్ వస్తున్నది.  తనకు కెరీర్లో బాగా కలిసి వచ్సిన సినిమా సాహసం.  పాక్ లోని తన తాత వజ్రాల వ్యాపారి అని, అక్కడి వదిలేసి వచ్చిన ఆ ఆస్తిని తెచ్చుకోవడానికి పాక్ వెళ్లిన గోపీచంద్ ఎలాంటి సాహసాలు చేశారో సినిమాలో చూపించారు.  సినిమా సూపర్ హిట్టైంది.  చంద్రశేఖర్ ఏలేటి సినిమాను అద్భుతంగా తీశాడు.  నిజంగానే సినిమా పాకిస్తాన్ లో తీశారా అనిపించే విధంగా ఆనంది.  


ఇప్పుడు అదే సెంటిమెంట్ తో రా ఏజెంట్ గా చేస్తున్న సినిమా చాణక్య.  ఈ సినిమాను తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్నారు.  నిన్ననే దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది.  రా ఏజెంట్ గా పాక్ లో ఉండటం అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది.  ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్న అజిత్ దోవల్ గతంలో పాక్ లో రా ఏజెంట్ గా ఉన్నారు.  ఎన్నో సాహసాలు చేశారు.  తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు రకరకాల గెటప్ లలో పాక్ లో తిరిగేవారు.  


దాదాపు అలాంటి గెటప్ లతోనే గోపీచంద్ పాక్ లో రా ఏజెంట్ గా సినిమా చేస్తున్నారు.  చాణక్య అంటేనే తెలివైన, సాహసంతో కూడిన అనే అర్ధం ఉన్నది. సాహసంలో పాక్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది.  ఇప్పుడు ఇదే విధంగా పాక్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే.. అంతకంటే కావాల్సింది ఏమున్నది.  గోపీచంద్ సినిమా హిట్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.  అప్పుడెప్పుడో లౌక్యం సినిమా తరువాత మరో హిట్ లేదు. ఈ సినిమా హిట్టయితే.. అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: