మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సినిమాలు చేశారు.  ఖైదీ సినిమా తరువాత మెగాస్టార్ మాస్ కు దగ్గరయ్యారు.  ఆ తరువాత వరస హిట్స్ .. డిఫెరెంట్ జానర్లలో ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాలు చేశారు.  సుప్రీం హీరో, మెగాస్టార్ బిరుదులు పొందారు.  అన్ని సినిమాలు చేసినా.. మెగాస్టార్ కు ఓ వెలితి ఉండిపోయింది.  ఓసారి కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమా చేశారట.  ఆ సినిమా చూసిన తరువాత మెగాస్టార్ రెండు రోజులపాటు విపరీతంగా ఏడ్చేశారు. 


కమల్ నటనకు ముగ్దుడయ్యాడు.  తనకెందుకు అలాంటి సినిమా చేసే అవకాశం రాలేదని తెగబాధపడి పోయారట మెగాస్టార్.  వెంటనే ఈ విషయాన్ని దర్శకుడు కె విశ్వనాధ్ దగ్గరకు వెళ్లి చెప్పారు.  స్వాతిముత్యం సినిమా చూసిన తరువాత తనకు కలిగిన ఫీలింగ్ గురించి చెప్పాడు. తనకు కెరీర్లో అలాంటి సినిమా కావాలని కోరారు.  దానికి విశ్వనాధ్ తప్పకుండా చేద్దామని హామీ ఇచ్చారు.  ఇచ్చినట్టుగా మెగాస్టార్ తో స్వయం కృషి చేశారు. 


అప్పటికే మెగాస్టార్ లో మాస్ లో మంచి గుర్తింపు ఉన్నది.  ఆ గుర్తింపుకు భంగం కలిగించకుండా.. మెగాస్టార్ కోరుకున్నట్టుగా నటనకు స్కోప్ ఉండేవిధంగా కథను రెడీ చేశారు.  స్వయం కృషి సినిమా తీశారు.  సినిమా బంపర్ హిట్.  మెగాస్టార్, విజయశాంతిలు పోటీపడి మరి నటించారు.  విశ్వనాధ్ సినిమాల్లో హీరోకు, హీరోయిన్ కు ఇద్దరికి తగిన పాత్రలు ఉంటాయి.  ఇద్దరి పాత్రలను సమానంగా తీర్చిద్దుతారు.  అదే అయన స్పెషాలిటీ.  


స్వయంకృషిలో మెగాస్టార్ చెప్పులు కుట్టే వ్యక్తిగా కనిపిస్తారు.  చెప్పులు కుట్టే వ్యక్తి ఎలా ఉంటాడు.. ఎలా చెప్పులు కొడతాడు.. ఎలా కత్తిని సానబెడతాడు అనే విషయాలను చెప్పేందుకు సెట్స్ లో ఓ వ్యక్తిని పెట్టారట.  ఆ వ్యక్తి నిత్యం మెగాస్టార్ కు అందులో తర్ఫీదు ఇచ్చేవాడు.  అలా చెప్పులు కుట్టడం అన్నది స్వయంకృషి సినిమాతో నేర్చుకున్నారు.  ఈ సినిమా తరువాత మెగాస్టార్ కు మరింత పేరు వచ్చింది.   స్వయంకృషితో మెగాస్టార్ ఎలా ఎదిగారో సినిమాలో చూపించారు దర్శకుడు కె విశ్వనాధ్.  ఈ సినిమా చాలామందికి ప్రేరణగా నిలిచింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: