నాని ‘గ్యాంగ్ లీడర్’ మరో రెండు రోజులలో విడుదల కాబోతున్నా ఈ మూవీకి ఇంకా చెప్పుకోతగ్గ హైక్ రాకపోవడం నానినీ కలవర పెడుతున్నట్లు టాక్. సాధారణంగా ఒక టాప్ హీరో సినిమా విడుదలకు ముందు ఇండస్ట్రీ వర్గాలలో ఆ సినిమాకు సంబంధించిన వార్తలు చాల హడావిడి చేస్తూ ఉంటాయి. 

దీనికి భిన్నంగా నాని ‘గ్యాంగ్ లీడర్’ గురించి ప్రస్తుతం ఎవరు ఇండస్ట్రీలో కూడ ఎక్కువగా ప్రస్తావించుకోవడం లేదు. అయితే ఈ మూవీకి నానీకి ఉన్న క్రేజ్ రీత్యా 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనితో ఈ మూవీ బయ్యర్లు బాగుపడాలి అంటే ఈ మూవీకి ఖచ్చితంగా 50 కోట్ల పైగా కలక్షన్స్ వచ్చి తీరాలి.

నాని లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’ కి పేరు వచ్చింది కాని ఆ స్థాయిలో కలక్షన్స్ రాలేదు. ప్రస్తుతం నాని పారితోషికం 8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇలాంటి పరిస్థితులలో నాని పారితోషికం ఆ రేంజ్ లో నిలబడాలి అంటే ‘గ్యాంగ్ లీడర్’ సూపర్ హిట్ అయితీరాలి. లేకుంటే నాని మార్కెట్ కు చాల ప్రమాదం ఏర్పడే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

దీనికితోడు విక్రమ్ కుమార్ తీసిన ఏ సినిమా కూడ ఇప్పటి వరకు 50 మార్క్ ను చేరుకోలేదు. మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా విక్రమ్ కుమార్ సినిమాలు తీయలేదు. ఇలాంటి పరిస్థితులలో కేవలం పాజిటివ్ టాక్ మాత్రమే కాకుండా ఓపెనింగ్ కలక్షన్స్ ‘గ్యాంగ్ లీడర్’ కు భారీగా రావాలి. అయితే ఈ మూవీకి సంబంధించి ఆన్ లైన్ అడ్వాన్స్ టిక్కెట్ల బుకింగ్ ఓపెన్ అయినా ఎటువంటి స్పందన అంతగా లేకపోవడంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ రాకపోతే తన పరిస్థితి ఏమిటి అంటూ నాని తెగ మధనపడిపోతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: