యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సాహో. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సాహో సినిమా పై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాహుబలి తరువాత ప్రభాస్ నటించే సినిమా ఆయనకి వచ్చిన క్రేజ్ ని పెంచేలా ఉండాలి అని భావించిన ఆయన స్నేహితులు ..యువీ క్రియేషన్స్ అధినేతలు సాహో ని ప్రభాస్ కోసమే తెరకెక్కించారు . ఇక భారీ అంచనాల మధ్య..ఆగస్ట్30 న 10 వేల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ప్రభాస్ కి మరో భారీ హిట్ ఇచ్చింది. 

ప్రభాస్ క్రేజ్ ని దృషిలో పెట్టుకొని ఈ సినిమాని నిర్మాతలు 300 కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమా గా  తెలుగు , తమిళ్, మలయాళం, హిందీలో నిర్మించారు. అలాగే సినిమా ప్రమోషన్స్ కూడా చాలా విన్నూతనంగా నిర్వహించారు. ఇది సినిమా ఓపెనింగ్ కి బాగా హెల్ప్ అయ్యింది.  అందరూ ఉహించినట్టే సాహో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. కానీ , కొంతమంది మాత్రం సాహో పై పూర్తిగా నెగటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసారు.  తొలి రోజు తొలి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ  సినిమా బ్రహ్మండంగా ఉండటంతో అభిమానులు, సాధారణ ప్రేక్షకులు సైతం సాహో పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

అలాగే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీగా కలెక్షన్స్ ని కురిపిస్తుంది. ఇప్పటికే 400 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ లో మాత్రం సాహో ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుందని తెలుస్తుంది. సాహో మహేష్ థియేటర్ లో విడుదల అయ్యిన మొదటి రోజు నుంచి వరుసగా నాలుగు రోజులు మొత్తం 140 షోలు హౌస్ ఫుల్స్ తో రన్ అయ్యాయని తెలుస్తుంది. అలా మొత్తం ఒక కోటి 6 లక్షల రూపాయలు వచ్చాయని సమాచారం .ఇప్పటి వరకు తోలి నాలుగు రోజుల్లో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టలేదు అని ,ఇదే అక్కడ ఆల్ టైం రికార్డు అని సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు  ఆనందం వ్యక్తం చేస్తున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: