‘అర్జున్ రెడ్డి’ మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన సందీప్ రెడ్డి అదే మూవీని ‘కబీర్ సింగ్’ గా మార్చి బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకుని నేషనల్ క్రేజీ డైరెక్టర్ స్థాయికి ఎదిగి పోయాడు. అలాంటి సందీప్ రెడ్డి తన కెరియర్ తొలి రోజులలో రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని చాల ప్రయత్నాలు చేసాడట.

అయితే అప్పటికే రాజమౌళి టీమ్ లో 20 మంది సహాయ దర్శకులు పనిచేస్తున్న పరిస్థుతులలో అప్పట్లో రాజమౌళి నుండి సందీప్ రెడ్డికి సరైన సమాధానం రాలేదని టాక్. దీనితో విసుగుచెందిన సందీప్ రెడ్డి తాను ఎవరి సహాయం లేకుండా దర్శకుడుగా మారుదామని ప్రయత్నాలు మొదలుపెట్టి అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ తో చాలామంది నిర్మాతలు హీరోల చుట్టూ తిరిగాడు. 

అయితే ‘అర్జున్ రెడ్డి’ స్క్రిప్ట్ ను నమ్మి ఏ నిర్మాత మరి ఏ హీరో ముందుకు రాకపోవడంతో సందీప్ రెడ్డి తన అన్నను నిర్మాతగా చేసి ఆ మూవీని తీసి ఘన విజయం సాధించాడు. రాజమౌళి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చినప్పటికీ రాజమౌళి దగ్గర పనిచేసిన సహాయకులు ఎవ్వరు దర్శకులుగా రాణించలేకపోయారు. 

దీనితో సందీప్ రెడ్డి రాజమౌళి దగ్గర సహాయకుడుగా పనిచేయకపోవడమే అదృష్టంగా మారిందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ‘కబీర్ సింగ్’ ఘన విజయం తరువాత అనేకమంది టాప్ టాలీవుడ్ హీరోలు ముఖ్యంగా మహేష్ సందీప్ రెడ్డి వైపు చూస్తున్నా పట్టించుకోకుండా ఈ డైరెక్టర్ రణబీర్ కపూర్ తో మరో భారీ బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడు. అంతేకాదు సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరో కూడ సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి ఆసక్తి వ్యక్తపరుస్తున్నాడు. చిరంజీవి వీరాభిమాని అయిన సందీప్ రెడ్డికి రాజమౌళి దగ్గర పనిచేయకపోవడమే ఒక అదృష్టంగా మారింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: