కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న తీరును నిరసిస్తూ ఇప్పటికే అనేక సామాజిక సంస్థలతో పాటు అనేక ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడ ‘సేవ్ నల్లమల’ అన్న ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుండి పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండలు తప్ప మరెవ్వరు ఇప్పటివరకు స్పందించలేదు.

దీనితో మన టాప్ హీరోల హిపోక్రసీ ని నిరసిస్తూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక టాప్ హీరోల వ్యక్తిత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎక్కడో ఇండియాకు దూరంగా ఉన్న అమజాన్ అడవులు కాలిపోతున్నందుకు ఎంతో వేదన చెందిన మన టాప్ హీరోలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నల్లమల అటవీ ప్రాంత సమస్య పై ఎందుకు స్పందించడం లేదు అంటూ ఆ పత్రిక ఘాటుగా కామెంట్ చేసింది.

ఇదే సందర్భంలో ఈ సామాజిక ఉద్యమానికి బాసటగా నిలిచిన పవన్ విజయ్ దేవరకొండ లను అభినందిస్తూ టాలీవుడ్ టాప్ హీరోలు వారిని ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్ చేసింది. 20 వేల ఎకరాల అటవీ ప్రాంతం నాశనం అయిపోయి అక్కడి సహజ సంపద అంతా కరిగిపోయి ప్రజలకు త్రాగడానికి మంచి నీరు పీల్చుకోవడానికి మంచిగాలి లేని పరిస్థితులు ఏర్పడితే అణు విద్యుత్ వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటూ విజయ్ దేవరకొండ చేసిన ట్విట్ కు ఆ పత్రిక తన సంఘీ భావాన్ని తెలియచేసింది. 

సాధారణంగా మహేష్ బన్నీ జూనియర్ చరణ్ లతో పాటు ఈమధ్య గతకొంత కాలంగా ప్రభాస్ కూడ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే గతంలో కూడ వీరంతా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ సమస్య మీద స్పందించిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు ఈ జాతీయ మీడియా కథనంద్వారా వారిలో చైతన్యం కలిగి పవన్ విజయ్ దేవరకొండలకు ఈ సమస్య పై బాసటగా నిలుస్తారేమో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: