జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం తో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ఆ తరువాత కాలంలో సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.  సినిమా క్షణం, రంగస్థలం సినిమాలు మంచి విజయాలు సాధించాయి.  అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తూ టాలీవుడ్ కు టచ్ లో ఉంటున్నది.  ఇదిలా ఉంటె, ఈ హీరోయిన్ ఇప్పుడు కథనం అనే సినిమా చేస్తున్నది.  ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది.  అనసూయ మెగాస్టార్ 152 వ సినిమాలో అవకాశం వచ్చినట్టు వార్తలు వచ్చాయి.  ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి.  


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ యురేనియం తవ్వకం.  నల్లమలలో ఉన్న యురేనియం తవ్వకాలను చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.  కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగురాష్ట్రాలలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు.  యురేనియం తవ్వకాలు జరిపితే అణుధార్మిక సంబంధమైన వ్యాధులు బారిన పడాల్సి వస్తుందని, కాలుష్యంతో కూడిన ప్రాంతాలుగా మారిపోతాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  


భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత తెలంగాణాను అందించాలని, యురేనియం తవ్వకాలను నిషేదించాలని పవన్ పేర్కొన్నారు.  దీనిపై అనేకమంది సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు.  ఇప్పుడు దీనిపై అనసూయ కూడా స్పందించింది.  యురేనియం ప్రాజెక్టు వద్దంటూ ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. తెలుగు రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులను ట్యాగ్ చేశారు. అయితే ఏపీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అని ట్యాగ్ చేశారు. 


అయితే, తెలంగాణా అటవీశాఖ మంత్రి విషయంలోనే ఆమె పొరపాటు పడ్డారు.  తెలంగాణా ఆటవిశాఖ మంత్రి జోగు రామన్న అనుకోని ట్యాగ్ చేసింది.  అనసూయ చేసిన ట్యాగ్ పై నెటిజన్లు స్పందించారు.  అనసూయ ట్వీట్ పై విమర్శలు చేశారు.  వెంటనే అనసూయ తప్పు తెలుసుకొని మంత్రికి క్షమాపణలు చెప్పింది.  తెరాస పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు జోగు రామన్న అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.  రెండోసారి అధికారంలోకి వచ్చాక జోగు రామన్నను పక్కన పెట్టిన ఆ స్థానంలో ఇంద్రకిరణ్ రెడ్డిని అటవీశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చింది తెరాస పార్టీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: