సీనియర్ నటుడు గిరిబాబు హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా 500 సినిమాలలో నటించడమే కాకుండా అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి దర్శకత్వం కూడ చేసాడు. సీనియర్ హీరోల నుండి నేటితరం యంగ్ హీరోల వరకు ఎంతో మందితో నటించిన గిరిబాబు ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు.

తెలుగు సినిమా రంగంలో ఎంతోమంది పాపులర్ హీరోలు వచ్చినా మరో 100 సంవత్సరాల వరకు సీనియర్ ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడు మళ్ళీ పుట్టడని కామెంట్స్ చేసాడు. అంతేకాదు తనతో నటించే సహ నటీనటుల పాత్రలకు సంబంధించి వారి నటనకు సంబంధించిన మెళుకువలు చెప్పడమే కాకుండా అందర్నీ నవ్వుతూ పలకరించే ఎన్టీఆర్ లాంటి వ్యక్తిత్వం ఈనాటి హీరోలలో తనకు అంతగా కనిపించడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

1983లో ఎన్టీఆర్ పిలుపును అందుకుని తెలుగుదేశం పార్టీలో చేరిన మొదటి సినిమా సెలెబ్రెటీలలో తాను ఒకడిని అని చెపుతూ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి దింపివేసిన సంఘటనను చూసి తాను ఆరోజు బాధతో భోజనం కూడ చేయలేదు అన్న విషయాన్ని వివరించాడు. అంతేకాదు ఈ విషయం పై స్పందించవలసిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడ మౌన పాత్ర వహించడం తనకు ఇప్పటికీ అర్ధంకాని సమాధానంలేని ప్రశ్న అని అంటున్నారు. 

ప్రస్తుతం తాను వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సంగతిని బయట పెడుతూ జగన్ మరొక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయం అని గిరిబాబు అభిప్రాయ పడుతున్నాడు. ఇదే సదర్భంలో తెలుగుదేశం ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుతూ ఆ పార్టీ తిరిగి జీవం పోసుకుని ప్రజల నమ్మకాన్ని పొందాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ వల్లనే అది సాధ్యం అని అంటూ జూనియర్ కు అటువంటి అవకాశం రానీయకుండా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే తెలుగుదేశం శాస్వితంగా కనుమరుగు అయిపోవడం ఖాయం అంటూ గిరిబాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: