నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా శుక్రవారం రోజు విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రుపాయలు, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రుపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న గ్యాంగ్ లీడర్ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు బాగానే ఉన్నాయి. వీకెండ్ పూర్తవటంతో ఈరోజు నుండి కలెక్షన్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 
 
మూడు రోజుల్లో గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 11.50 కోట్ల రుపాయలు, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రుపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లోనే 50 శాతం రికవరీ చేయటంతో తొలి వారంలోనే చాలా ఏరియాలలో బ్రేక్ ఇవెన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. నైజాంలో ఈ సినిమా మిగతా ఏరియాలతో పోలిస్తే మెరుగైన వసూళ్లను సాధిస్తోంది. 
 
దర్శకుడు విక్రమ్ కె కుమార్ కథ, కథనంతో మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. సాధారణ కథను ఆసక్తికరంగా నడపటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హలో సినిమా ప్లాప్ అయినా గ్యాంగ్ లీడర్ హిట్ కావటంతో నిర్మాతలు, హీరోల నుండి విక్రమ్ కు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. నాని మరోసారి తన నాచురల్ యాక్టింగ్ తో సినిమాను హిట్ చేశాడు. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ప్రియాంక పాత్రకు తగిన న్యాయం చేసింది. 
 
ఈ సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా గత కొంతకాలంగా సరైన విజయాలు రావట్లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. చిత్రలహరి పరవాలేదనిపించినా డియర్ కామ్రేడ్ సినిమా భారీగా నష్టాల్ని మిగిల్చింది. గ్యాంగ్ లీడర్ సినిమాకు హిట్ టాక్ రావటం, శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడవటంతో నిర్మాతలకు ఈ సినిమా భారీగా లాభాలు అందించే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: