మెగా అభిమానులతో పాటుగా యావత్ తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూన్నసినిమా సైరా.. ఎందరో సీనియర్ నటులు నటిస్తున్న ఈ సినిమాపై ముందునుండి భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ ముగించుకొని ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈ మూవీకి  ప్రస్తుతం ఎదురు దెబ్బ తగిలింది. కొడుకు చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు ప్రముఖ చరిత్రకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. 


వివాహయానికొస్తే.. ఎన్ని ఉన్న కూడా ఇది సినిమా అని పరిచయం చేసుకోవడానికి ముందుగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం సైరకు అందని ద్రాక్షలా మారింది. రోజు రోజుకు వాయిదా పడుతూ వస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత జిల్లా అయిన కర్నూల్‌లో చెయ్యాలి అని అనుకున్నారు. దానికోసం అన్ని సిద్ధం చేసుకునాన్రు చిత్ర యూనిట్. కానీ,ఆ రోజు వర్షం పడుతుందనే ఈవెంట్ ను విరమించుకున్నారు. 


ఇకపోతే సినిమా రిలీజ్ కి కేవలం అర్ద నెల అంటే పదిహేను రోజులు మాత్రమే ఉంది. అయితే, ఎంత వరకు సినిమా రుచిని తెలుగు ప్రేక్షకులకు ఇంకా చూపించనేలేదు ఆ చిత్ర యూనిట్. ఎందరో ఫెమస్ నటినటీమణులున్న ఈ సినిమా చరిత్రాత్మకతను పెంపొందించేలా ఉండబోతుంది. భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సంబందించిన నటులు ఈ సినిమాలో ప్రముఖ పాత్రల్లోనటిస్తున్నారు. 


అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటిలో కాదని కొందరు, మరికొందరేమో ఎల్ బి స్టేడియంలో ఈ ఈవెంట్ ని జరిపించిందేందుకు ప్లాన్ మార్చారని అంటున్నారు. వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఈవెంట్ డేట్ వచ్చే వరకు ఆగాల్సిందే. అక్టోబర్ 2 న అయినా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: