తక్కువ ఖర్చుతో సమర్ధవంతంగా ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టగలిగే సత్తా ఉన్న అంతరిక్ష సంస్థ ఇస్రో.  అతి తక్కువ ఖర్చుతోనే మార్స్ లోకి మొదటిసారి ఉపగ్రహాన్ని పంపి విజయం సాధించింది.  మార్స్ వరకు ప్రయాణం చేసిన మామ్ ఉపగ్రహం ప్రస్తుతం మార్స్ గ్రాహం చుట్టూ పరిభ్రమిస్తూ అక్కడి వాతావరణ పరిస్థితులను సేకరిస్తోంది.  ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో చంద్రయాన్ 2 ను ప్రయోగించింది.  ఈ ప్రయోగానికి కేవలం రూ. 900 కోట్లు ఖర్చు చేసింది.  


చివరి నిమిషం వరకు విజయవంతంగా సాగిన యాత్ర.. మరో నిమిషంలో లాండింగ్ కాబోతుందనగా సిగ్నల్స్ మిస్ అయ్యాయి.  దీంతో విక్రమ్ జాడ కోసం అన్వేషణ మొదలైంది.  అయితే, చంద్రయాన్ 2 పంపించిన ఆర్బిటర్ విక్రమ్ జాడను కనిపెట్టింది.  ఒక పక్కకు ఒరిగి ల్యాండ్ అయినట్టు తెలిపింది.  దీంతో విక్రమ్ సిగ్నల్స్ ను పునరుద్ధరించేందుకు ఇస్రో ప్రయత్నించింది.  అటు నాసా సపోర్ట్ కూడా తీసుకుంది.  నాసా సైతం విక్రమ్ కు సిగ్నల్స్ పంపినా ఉపయోగం లేకుండా పోయింది.  


ఇదిలా ఉంటె, గతంలో నాసా చెందిన ఆర్బిటర్ మంగళవారం రోజున విక్రమ్ దిగిన స్థలంగా చెప్తున్న ప్రాంతానికి రాబోతున్నది.  విక్రమ్ కు సంబంధించిన యధాస్థితి ఫోటోలను తీయబోతున్నది.  ఈ నాసా ఆర్బిటర్ చంద్రుని తక్కువ ఎత్తులోనే పరిభ్రమణం చేస్తున్నది.  నాసా పంపించే ఫోటోలను బట్టి విక్రమ్ జాడను అంచనా వేసే అవకాశం ఉన్నది.  ఇదిలా ఉంటె ఈరోజు హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ నాసా కేంద్రానికి వెళ్లారు.  తన కొత్త సినిమా ఆడ్ ఆస్ట్రా ప్రమోషన్లో భాగంగా అక్కడికి వెళ్లారు.  ఇందులో బ్రాడ్ పిట్ వ్యామోగామిగా నటిస్తున్నారు.  


నాసా కేంద్రానికి వెళ్లిన బ్రాడ్ పిట్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నిక్ హెగ్ తో దాదాపు 20 నిమిషాలపాటు వీడియో కాల్ మాట్లాడారు.  గురుత్వాకర్షణ శక్తి గురించి.. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వాతావరణం గురించి మాట్లాడారు.  అలానే ఇండియా ప్రయోగించిన చంద్రయాన్ 2 గురించి అడిగాడు. విక్రమ్ ను చూశారా అని అడిగితె.. దురదృష్ట వశాత్తు ఇంకా లేదని, జాడ కోసం ప్రయత్నిస్తున్నట్టు హెగ్ పేర్కొన్నారు.  ఇదిలా ఉంటె, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి చేపట్టిన అంతరిక్ష కేంద్రం లానే ఇండియా కూడా త్వరలోనే ఓ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది.  మరో రెండేళ్లలో ఈ అంతరిక్ష కేంద్రం నిర్మాణం ప్రారంభం అవుతుందని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: