నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా శుక్రవారం రోజు విడుదలైంది. ఎంసీఎ సినిమా తరువాత నాని నటించిన కృష్ణార్జున యుధ్ధం, దేవదాస్ ప్లాప్ అయ్యాయి. జెర్సీ సినిమాకు హిట్ టాక్ వచ్చినా టాక్ కు తగిన కలెక్షన్లు మాత్రం రాలేదు. భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న నానికి గ్యాంగ్ లీడర్ సినిమాతో హిట్ వచ్చినట్లే అని చెప్పవచ్చు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ కు కూడా మనం సినిమా తరువాత సరైన సక్సెస్ లేదు. 
 
మనం తరువాత విక్రమ్ సూర్యతో తీసిన 24 సినిమా తెలుగులో హిట్టైనా తమిళంలో యావరేజ్ అనిపించుకుంది. అఖిల్ తో తీసిన హలో సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఆ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అనిపించుకుంది. విక్రమ్ కె కుమార్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. గ్యాంగ్ లీడర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 13 కోట్ల రుపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 21 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. 
 
ఇప్పటికే 60% రికవరీ కావటంతో పుల్ రన్లో ఈ సినిమా భారీగా లాభాల్ని అందించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 16.50 కోట్ల రుపాయల షేర్ వచ్చినట్లు సమాచారం. సీడెడ్ ఏరియాలో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ కు రంగస్థలం తరువాత ఈ సినిమాతో మంచి హిట్ వచ్చింది. 
 
గ్యాంగ్ లీడర్ హిట్ కావటంతో విక్రమ్ కె కుమార్ కు నిర్మాతలు, హీరోల నుండి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. నాని ప్రస్తుతం ఇండ్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో V అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో కనిపించబోతూ ఉండటం విశేషం. సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా కనిపిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 




మరింత సమాచారం తెలుసుకోండి: