రానా కు జూలైలో కిడ్నీ ఆపరేషన్ చికాగోలోని ఒక ప్రముఖ హాస్పటల్ లో జరిగిన వార్తలు ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ ఆ వార్తల పై రానా కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెపుతూ కాలం గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో రానా ఆరోగ్యానికి సంబంధించిన ఒక లీక్ ఇండస్ట్రీ వర్గాలకు తెలిసింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు రానా ఆపరేషన్ తరువాత కోలుకోవడంతో అక్కడి డాక్టర్లు హాస్పటల్ వాతావరణం నుండి బయటకు వెళ్లి ఒక వారంరోజుల పాటు అమెరికాలో ఎక్కడైన ఉండి రమ్మని చెప్పారట. డాక్టర్ల సలహాతో రానా అలా ఒక వారంరోజులు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అతడి ఆరోగ్యంలో మార్పులు లేనప్పటికీ అతడు బాగా అలసిపోయిన విషయాన్ని అక్కడి డాక్టర్స్ గుర్తించినట్లు టాక్. 

దీనితో ఈ నెలలో ఇండియాకు తిరిగి రావాలి అని రానా వేసుకున్న ప్లాన్స్ ను అక్కడి డాక్టర్స్ తిరస్కరించడమే కాకుండా మరికొంత కాలం రానా తమ పర్యవేక్షణలో ఉండాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈనెలాఖరులోపు రానా తిరిగి వచ్చే ఆలోచనలు వాయిదా పడ్డాయని వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

వాస్తవానికి రానా తిరిగి వచ్చి విరాటపర్వం మూవీకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ లో పాల్గొంటాడని ప్రచారం జరిగింది. ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడ పూర్తి అయ్యాయి. ఇప్పడు రానా ఇండియా వచ్చే ప్రోగ్రాంలో అనేక మార్పులు రావడంతో ‘విరాటపర్వం’ నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రానా లేకుండా ఈ మూవీకి సంబంధించిన సీన్స్ అన్నీ సాయి పల్లవితో సహా అనేకమంది పై షూట్ చేసి ఈమూవీ పనులు నడిపిస్తున్నా హీరో రానా రాకుండా ఎన్నిరోజులు ఇలా గడుపుకు రాగలం అని ఈమూవీ నిర్మాతలు టెన్షన్ పడుతున్నట్లు టాక్. దీనితో రానా రంగంలోకి దిగి అమెరికా నుండి ఈమూవీ నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతూ వారికి ధైర్యం చెపుతున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: