ఇండస్ట్రీలో అడుగుపెట్టే వాళ్ళందరూ తమ అవకాశాలను కోరికలను బట్టి ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఇది వరకు హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వేళ్ళ మీద లెక్క పెట్టే స్థాయిలోనే ఉండేవారు. ఇప్పుడు రోజుకో కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. కొత్త హీరో ఎవరైనా ఒక హిట్ వస్తే అంత గొప్పవాడు ఫీలవుతూ ఉంటున్నారు. ఇక ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్ కామన్. అవకాశాల కోసం కొంతమంది సర్వం సమర్పించుకుంటూ ఉంటారు.
ఇదిలా ఉంటే ఒక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ తోటి హీరోలతో చాలా స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయడంతో పాటు హీరోయిన్ లకు సైతం లైన్ వేస్తుందట. ఆమె కోరికలు సైతం వాళ్లతోనే కాని చ్చేస్తుందట. ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కడంతో ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం అని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ఆమెకు మగవాళ్ల కంటే ఆడవాళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం అట. ఆ హీరోయిన్‌కు లెస్బియన్ కళలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ విషయం ఆమెతో మాత్రమే తిరిగే కొందరు హీరోయిన్స్ కు బాగా తెలుసట. అయితే ఎవరి ఇష్టాలు వాళ్ళవి కదా అని తోటి హీరోయిన్లు కూడా ఆమెను భరిస్తున్నారట. అయితే పైకి చూడటానికి చాలా పద్ధతిగా కనిపించే ఆ హీరోయిన్ లోపల మాత్రం.. ఊరమాస్ లక్షణాలతోనే ఉంటుందట.
హీరోల కన్నా హీరోయిన్స్ తో నే ఎక్కువ క్లోజ్‌గా ఉండే ఆమె వారితోనే బెడ్ సైతం షేర్ చేసుకుంటుందట. ఇటీవల ఆమె ఓ హీరోయిన్ తో కూడా జాలీ ట్రిప్ కూడా వేసిందని తెలుస్తోంది. ఈ అమ్మడు వ్యవహారం తెలిసిన దర్శకనిర్మాతలు ఆమెను దూరం పెడుతున్నారు. అయితే సినిమాలకు.. ఈ వ్యవహారానికి సంబంధం లేకపోవడంతో కొంత మంది మాత్రం ఆ స్టార్ హీరోయిన్ తో సినిమాలు చేస్తున్నారు.