దర్శక ధీరుడు రాజమౌళి నిన్నటి ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవిపైనా రామ్ చరణ్ పైనా రచయితలు పరుచూరి బ్రదర్స్ పైనా ప్రశంసలు కురిపిస్తూ మధ్యలో అన్న ఒక మాట పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో లోతైన విశ్లేషణలు జరుగు తున్నాయి.  రాజమౌళి తన ఉపన్యాసంలో ‘బాహుబలి’ ని మించి వీఎఫ్ ఎక్స్ ని ‘సైరా’ చిత్రం కోసం ఉపయోగించారు అని చెపుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

‘బాహుబలి 2’ కి 2200 షాట్లు సుమారుగా ఉపయోగిస్తే ‘సైరా’ చిత్రం కోసం ఏకంగా 3800 వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఉపయోగించడమే కాకుండా ఇందుకోసం ఏకంగా 45 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలియచేస్తూ ఒక షాకింగ్ కామెంట్ చేసాడు.  ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన  కమల్ కన్నన్  తనకు  సైరా వీఎఫ్ ఎక్స్ షాట్స్ గురించి  చెప్పాడు అనిచెపుతూ అయితే అది ఎంత కష్టమో తనకు తెలుసు అని అంటూ  అన్నివందల వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఉపయోగిస్తే దానితో పాటే ఎక్కడా ఎమోషన్ మిస్ కాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుందని రాజమౌళి అభిప్రాయ పడ్డాడు. 

దీనితో ఇప్పటికే ‘సైరా’ లో ఎమోషన్ పార్ట్ తక్కువగా ఉంటుందా అన్న చర్చలు జరుగుతున్న పరిస్థితులలో రాజమౌళి అన్న మాటల వెనుక అర్ధాలు ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే  ‘సైరా’ ట్రైలర్ ను విశ్లేషిస్తున్న కొందరు విశ్లేషకులు ‘సైరా’ సాధారణ ప్రేక్షకులు కనెక్ట్ కావడానికి అవసరం అయిన సెంటిమెంట్ స్పెస్ ఈ మూవీలో తక్కువగా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

ఎంత భారీ సినిమా అయినప్పటికీ సెంటిమెంట్ సీన్స్ సరిగా కుదరకపోతే ఆ మూవీ అనుకున్న విజయం అందుకోలేదని ‘సాహో’ ఫలితం రుజువు చేసింది. దీనితో ‘సైరా’ లో భారీ తనంతో పాటు బలమైన సెంటిమెంట్ సిన్స్ ఉన్నాయా లేవా అన్న చర్చలు మరోసారి ప్రారంభం అయ్యాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: