తెలుగులో టాప్ హీరోలలో ముఖ్యంగా విన్పించే పేరు మెగాస్టార్  చిరంజీవి. ఎటువంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ ను నమ్ముకొని, తన కష్టం తో స్వయం కృషితో పైకొచ్చాడు. సినిమాలలోకి వచ్చిన కూడా ఎన్నో కష్టాలను. అవమానాలను ఎదుర్కొంటూ సినిమాలలో నటిస్తూ వచ్చాడు. చిరు చేసిన సినిమా చాలా వరకు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలే ఉన్నాయి. అలా చిరు సినిమా జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాడు. 


హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తూ మెగాస్టార్ గా ఎదిగాడు. తెలుగులో ఈయన 150 కు పైగా సినిమాలలో నటించి ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఎన్నికల్లో నిలబడ్డారు. కానీ, రాజకీయాల్లో రాణించలేకపోయిన చిరు మళ్ళీ సినిమాల వైపు వచ్చాడు. అలా అయన ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. 


ఆ సినిమా తర్వాత ప్రస్తుతం చిరు నటించిన తాజా చిత్రం సైరా.. ఈ సినిమా చరిత్ర కారుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటి నటీమణులు నటించారు. 


ఇకపోతే ఈ సినిమా వివాదల మధ్య రిలీజ్ కాబోతుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఉయ్యాలవాడ వంశస్థులు నిన్న చిరంజీవిని కలిశారు. గొప్ప ఉద్యమకారుడైన నరసింహారెడ్డి ఖ్యాతిని దిశలుగా పెంచేందుకు చిరంజీవి చేసిన ప్రయత్నం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. కర్నూల్ కోవెంట్లలో అయన స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ ప్రారంభోత్సవానికి మీరు తప్పక రావాలని ఆ కుటుంబం కోరింది. విషయానికొస్తే ఈ సినిమా తాజాగా సెన్సార్ నూయి పూర్తి చేసుకుంది. అక్టోబర్ రెండున రిలీజ్ కాబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: