చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. సైరా సినిమాను చిత్రీకరించటానికి తమతో ఒప్పందం కుదుర్చుకున్నారని కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారని, నగదు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకొని ఆ నగదును చెల్లించటం లేదని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు కోర్టు మెట్లు ఎక్కటం జరిగింది. 
 
దస్తగిరి అనే వ్యక్తితో పాటు మరో నలుగురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని సమాచారం. సైరా చిత్రం విడుదల ఆపాలని, తమకు నష్టపరిహారం చెల్లించి తీరాలని ఆ తరువాతే సైరా చిత్రం విడుదల చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను కొంత వక్రీకరించారని, సినిమాలో వాస్తవాలను పెట్టలేదని కూడా  నరసింహారెడ్డి వారసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. 
 
నరసింహారెడ్డి వారసుల అభ్యంతరాలపై సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంది? నరసింహారెడ్డి వారసుల యొక్క అభ్యంతరాలను సెన్సార్ బోర్డు పరిగణనలోకి తీసుకుందా ? అనే విషయాలపై సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది వాదనలు రేపు వినిపిస్తానని చెప్పినట్లు సమాచారం. ఆర్టికల 32 ప్రకారం బయోపిక్ నిర్మించే సమయంలో వారసులు చెప్పే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ నిబంధనలు చెబుతూ ఉండటంతో  వారి వాదన కూడా వినాలని హైకోర్టు చెప్పింది. 
 
సైరా చిత్ర యూనిట్ మాత్రం కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్నారని, నిజమైన ఉయ్యాలవాడ కుటుంబీకులకు మరియు ఊరికి నష్ట పరిహారం చెల్లిస్తామని వారికి తగిన న్యాయం చేస్తామని చెప్పినట్లు సమాచారం. అందరి వాదనలు విన్న తరువాత కోర్టు కేసును రేపటికి వాయిదా వేయటం జరిగింది. రేపు సెన్సార్ బోర్డు వాదనలు విన్న తరువాత హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: